నన్ను 'ఎక్స్‌ట్రా ప్లేయర్' గా చూస్తారంటున్న హీరో
అష్టా చమ్మా ఫేమ్ నాని నటించిన తాజా చిత్రం 'భీమిలి కబడ్డీ జట్టు' ఈనెల 9న చిత్రం విడుదలవుతోంది. తాతినేని సత్యను దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిన ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్, పారాస్ జైన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ...సహజత్వానికి దగ్గరగా ఉంటూ అందర్నీ హత్తుకునే విధంగా ఉంటుంది. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు భిన్నంగా ఈ చిత్రంలో నా పాత్ర ఉంటుంది. సినిమాలో కబడ్డీ ఆట తెలియని నన్ను 'ఎక్స్ ట్రా ప్లేయర్'గా చూస్తారు. ఎవరైనా లేనప్పుడు ఆట ఆడే అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత కథ ఏంటి? అనేది సినిమాలో చూస్తేనే బాగుంటుంది. నా కెరీర్ లో 'భీమిలి కబడ్డీ జట్టు' మరో మంచి సినిమా అవుతుంది అన్నారు. అలాగే తమిళంలో రూపొందిన 'వెనిలా కబడ్డీ కుళు' చిత్రానికి కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఈ చిత్రాన్ని రూపొందించాం. తమిళ చిత్రంకన్నా గొప్పగా వచ్చిందని చెప్పను గానీ అక్కడ మిస్ అయిన కొన్ని అంశాలను పొందుపరిచాం. కబడ్డీ ఆట నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది అని నాని అన్నాడు.


Click it and Unblock the Notifications











