'భీమిలి కబడ్డీ జట్టు' రిలీజ్ ఎప్పుడంటే...
తమిళంలో హిట్టయిన 'వెన్నెల కబడ్డి కూటం' చిత్రాన్ని తెలుగులో 'భీమిలి కబడ్డీ జట్టు' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాని, శరణ్యామోహన్, కీర్తన, కిషోర్ ముఖ్య పాత్రలుగా మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ ప్రై. లిమిటెడ్ ఈ చిత్రం నిర్మిస్తోంది. ఇక ఈ 'భీమిలి కబడ్డీ జట్టు' నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుని, ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం ద్వారా తాతినేని సత్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం గురించి...సమర్పకులు ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ "పల్లెటూళ్లకు ఆటలతో అనుబంధం ఎక్కువ. ఒక్కో ఊరు ఒక్కో ఆటలో ప్రావీణ్యం కలిగి వుంటుంది. అలా కబడ్డీకి పేరొందిన భీమిలి జట్టుకు ఒకసారి సిసలైన పోటీ ఎదురవుతుంది. అప్పుడు జరిగిందేంటో మా చిత్రం చూస్తే తెలుస్తుంది అన్నారు. 'పల్లె వాతావరణానికి అద్దం పట్టే ఈ చిత్రం కథ: సుశీ, మాటలు: అల్లు దిలీప్ కుమార్, సంగీతం: సెల్వగణేష్, ఛాయాగ్రహణం: కె.చిట్టిబాబు.


Click it and Unblock the Notifications











