twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సుడిగాడు'ఎలా రూపొందించానంటే...: భీమినేని

    By Srikanya
    |

    హైదరాబాద్: అల్లరి నరేష్ కొత్త చిత్రం 'సుడిగాడు'త్వరలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ''సినిమా సక్సెస్‌ అనేది ఓ రేస్‌లా తయారైంది. పకడ్బందీగా, కొత్తగా కథను చెప్పకపోతే ప్రేక్షకుల్ని మెప్పించలేకపోతున్నాం. అందుకే ఏదో ఒకటి తీయలేక మంచి చిత్రాన్ని రూపొందించాలని కాస్త ఎక్కువ విరామమే తీసుకున్నాను. ప్రేక్షకుణ్ని హాయిగా నవ్వించాలనుకున్నాను. ఆ సమయంలో 'తమిళ్‌పడమ్‌' అనే చిత్రం చూశాను. దీన్ని తెలుగులో రూపొందిస్తే బోలెడంత వినోదం పండించవచ్చు అని నిర్ణయించుకుని ఈ సినిమాను మొదలుపెట్టాను''అన్నారు.

    అలాగే ''ఒకట్రెండు పేరడీ సన్నివేశాలతో చాలా సినిమాలొచ్చాయి. సినిమా మొత్తం పేరడీ సన్నివేశాలంటే కత్తి మీద సాము అనే చెప్పాలి. ఎందుకంటే ఇది కేవలం హాస్యనటులతో నడిపించేది కాదు. హీరో చుట్టూ అల్లుకున్నది. తమిళంలో ఈ ఫార్ములా హిట్‌ అయిందన్న ధైర్యంతో కథను సిద్ధం చేశాను. తెలుగులోకి వచ్చేసరికి చాలా మార్చుకోవల్సి వచ్చింది''.

    నరేష్ గురించి మాట్లాడుతూ...''నరేష్‌కు ఇలాంటి పాత్రలు కొట్టినపిండి. నా నమ్మకాన్ని వందశాతం నిలబెట్టారు. వందసినిమాల గెటప్పులు నరేష్‌ చేత వేయించాలంటే ఆయనకున్న మార్కెట్‌, బడ్జెట్‌ ఇలా లెక్కలు వేసుకోవాలి. అసలు సినిమాలో ఆయా హీరోలు వేసుకున్న గెటప్పులకు ఏ మాత్రం తగ్గకుండా నరేష్‌ కనిపిస్తారు'' అన్నారు.

    ఇక తమిళ సూపర్ హిట్ తమిళ పదం రీమేక్ గా రూపొందున్న ఈ చిత్రాన్ని భీమినేని శ్రీనివాస రావు డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో దాదాపు ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు సినిమాలు అన్ని స్పూఫ్ లు ఉంటాయి. పూర్తిగా సినిమాలపై స్పూఫ్ గా తయారైన ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల చేయనున్నారు. పాటలు ఈ నెలలో నే విడుదల చేస్తారు. 'సుడిగాడు'కి ట్యాగ్ లైన్..'ఒకే టిక్కెట్‌పై 100 సినిమాలు' అని పెట్టారు.

    చంద్రమోహన్‌, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్‌ నారాయణ, చలపతిరావు, కోవై సరళ, హేమ తదితరులు ఇతర పాత్రధారులు. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, సంగీతం: శ్రీవసంత్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ ఉలగనాథ్‌. ఈ చిత్రంలో అల్లరి నరేష్ హిట్ చిత్రాల పేరడీ చేస్తూ కథ నడుపుతూంటాడు. మోనాల్‌ గజ్జర్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్‌.డి.రెడ్డి నిర్మాత.

    English summary
    
 Allari Naresh's market value has increased with Sudigaadu movie. Sudigaadu has fetched Rs 45 lakhs for overseas market for the film's producers. This has happened for the first in Allari Naresh's career. The film is a spoof on all the mass Telugu films and superstars.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X