twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివాదాస్పదమవుతున్న రాజమౌళి ట్వీట్లు.. భీమ్లా నాయక్ వాయిదాపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. RRR ఏక పక్షంగా అంటూ..

    |

    సంక్రాంతి బరి నుంచి భీమ్లా నాయక్ తప్పుకోవడంపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. భీమ్లా నాయక్ రిలీజ్ వాయిదా పడటానికి పరోక్షంగా కారణమైన ఎస్ఎస్ రాజమౌళిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. తమ ఇష్టం వచ్చినట్టు రిలీజ్ డేట్లు మార్చుతూ భీమ్లా నాయక్‌‌ సినిమా వాయిదాకు కారణం అంటూ పవన్ కల్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. అయితే ఈ వివాదానికి అసలు కారణాలు ఏమిటంటే?

    Recommended Video

    Bheemla Nayak New Release Date Announced | Pawan Kalyan| Rana Daggubati
    అక్టోబర్‌లో RRR వాయిదా

    అక్టోబర్‌లో RRR వాయిదా

    RRR సినిమా మొదలైనప్పటి నుంచి పలు కారణాల వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్నది. చివరికి అక్టోబర్‌లో విడుదల చేస్తామంటూ పక్కాగా రిలీజ్ డేట్లను అనౌన్స్ చేయడంతో రాజమౌళి‌పై గౌరవం కొద్ది పలు భారీ సినిమాలు తమ సినిమాలను దసరా బరిని తప్పించాయి. ఆ తర్వాత సంక్రాంతి కానుకగా సర్కారు వారీ పాట, భీమ్లా నాయక్, రాధేశ్యామ్, బంగార్రాజు సినిమాలు తమ రిలీజ్ డేట్లను ప్రకటించారు. అయితే సాంకేతిక కారణాల వల్ల దసరా (అక్టోబర్) రావాల్సిన RRR మూవీ రిలీజ్ వాయిదా వేసి గందరగోళానికి తెర లేపారు.

    ఏకపక్షంగా జనవరి 7న రిలీజ్ అంటూ జక్కన్న

    ఏకపక్షంగా జనవరి 7న రిలీజ్ అంటూ జక్కన్న


    అయితే సినిమా పరిశ్రమలోని ప్రొడ్యూసర్ గిల్డ్‌ను, సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల నిర్మాతలను సంప్రదించకుండా ఎస్ఎస్ రాజమౌళి టీమ్ జనవరి 7 తేదీన RRR సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో సంక్రాంతి బరిలో ఉన్న నిర్మాతలు షాక్ తినడమే కాకుండా పలు రకాల ఒత్తిడికి గురయ్యారు. అయితే RRR రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్టు రాధేశ్యామ్ రిలీజ్‌ను ఆపేందుకు రాయబారం నడపటం, అందుకు యూవీ క్రియేషన్స్‌ ఒప్పుకోకపోవడం జరిగింది. RRRతోపాటు తాము రిలీజ్ చేస్తామని రాధేశ్యామ్ జక్కన్న రాయబారికి క్లియర్ సిగ్నల్ ఇవ్వడంతో పోటీ అనివార్యమైంది.

    భీమ్లా నాయక్‌ను వాయిదా వేయాలని..

    భీమ్లా నాయక్‌ను వాయిదా వేయాలని..


    ఇక సంక్రాంతి రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో భీమ్లా నాయక్ రిలీజ్ వాయిదా వేయాలని నిర్మాత చిన్నబాబుపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. అయితే తమను సంప్రదించకుండా, ఇతర నిర్మాతలను అడగకుండా ఏకపక్షంగా RRR రిలీజ్ డేట్‌ను ఎలా ప్రకటిస్తారు? మీరు అక్టోబర్ రిలీజ్ అంటేనే తాము సంక్రాంతికి రిలీజ్ డేట్ ప్రకటించామని టీమ్‌ను నిలదీసినట్టు తెలిసింది. భీమ్లా నాయక్ నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ తమ సినిమా తప్పకుండా సంక్రాంతికి రిలీజ్ అవుతున్నట్టు ట్వీట్లు చేసి సవాల్ విసిరినంత పని చేశారు.

    భీమ్లా నాయక్ వాయిదా అంటూ దిల్ రాజు

    భీమ్లా నాయక్ వాయిదా అంటూ దిల్ రాజు


    అయితే RRR సినిమాకు పోటీగా మారిన భీమ్లా నాయక్‌ను పోటీ నుంచి ఎలాగైనా తప్పించాలనే ప్రయత్నంతో ప్రొడ్యూసర్స్ గిల్డ్‌పై RRR టీమ్ సంప్రదింపులు జరిపింది. అయితే ప్రముఖ నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగి భీమ్లా నాయక్‌ను సంక్రాంతి బరి నుంచి తప్పించారు. జనవరి 12 నుంచి మార్చి ఫిబ్రవరి 25వ తేదీకి మార్చుతున్నట్టు నిర్మాత దిల్ రాజు తమ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులతో అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ మీడియా సమావేశానికి భీమ్లా నాయక్ నిర్మాత రాకపోవడం, సరిగా స్పందించకపోవడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి.

    పవర్ స్టార్ ఆగ్రహానికి గురైన రాజమౌళి ట్వీట్లు

    పవర్ స్టార్ ఆగ్రహానికి గురైన రాజమౌళి ట్వీట్లు


    RRR సినిమాకు పోటీగా నిలిచిన భీమ్లా నాయక్‌‌ను రిలీజ్ డేట్ మార్చుతున్నట్టు ప్రొడ్యూసర్‌ గిల్డ్ ప్రకటించిన తర్వాత ఎస్ఎస్ రాజమౌళి వరుస ట్వీట్లు చేయడం పలురకాల చర్చకు దారితీయడమే కాకుండా పవన్ కల్యాణ్ అభిమానుల అగ్రహానికి కారణమైంది. నా హీరో మహేష్ బాబు సర్కారు వారి పాటను RRRకు పోటీగా రిలీజ్ చేయవద్దని నిర్ణయం తీసుకొన్నారు. అందుకు థ్యాంక్స్ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే భీమ్లానాయక్‌ రిలీజ్ డేట్‌ను మార్చినందుకు చినబాబు, పవన్ కల్యాణ్ అభినందనీయులు అంటూ కామెంట్ చేశారు. అలాగే దిల్ రాజు నిర్మిస్తున్న F3 సినిమా రిలీజ్ డేట్‌ను ఫిబ్రవరి 25 నుంచి ఎప్రిల్ 29వ తేదీకి మార్చడంపై థ్యాంక్స్ చెప్పారు.

    సర్కారు వారి పాట, F3 రిలీజ్ కాకుండానే

    సర్కారు వారి పాట, F3 రిలీజ్ కాకుండానే


    అయితే రాజమౌళి వరుస ట్వీట్లు చేసిన తీరుపై పవన్ కల్యాణ్ అభిమానుల, సినీ వర్గాలు మండిపడుతున్నారు. రెండు నెలల క్రితం దాదాపు 100 రోజులు సినిమా షూటింగ్ పెండింగ్ ఉన్న సర్కారు వారి పాట సినిమా రిలీజ్ వాయిదా చేసుకొన్నది. ఇంకా F3 షూటింగు పూర్తి కాలేదు. ఈ రెండు సినిమాలు తమ రిలీజ్ వాయిదా వేసుకోవడంతో వారిని రాజమౌళి భుజానెత్తుకొని ప్రశంసలు కురిపించారు. సినిమా పూర్తి చేసుకొని సంక్రాంతి బరి నుంచి ఆఖరి నిమిషంలో తప్పుకొన్న భీమ్లానాయక్ నిర్మాతలను, టీమ్‌పై రాజమౌళి కామెంట్స్ ఏదో మొక్కుబడిగా ఉన్నాయనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. రాజమౌళి ట్వీట్లపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

    సొంత ప్రయోజనాల కోసం రాజమౌళి

    సొంత ప్రయోజనాల కోసం రాజమౌళి


    నిర్మాత చిన్నబాబును సంప్రదించకుండా రిలీజ్ పెట్టుకోవడమే కాకుండా భీమ్లా నాయక్‌li అడ్డుతప్పించుకోవడానికి దిల్ రాజుతో తెర వెనుక నడిపిన మంత్రాంగంపై సినీ వర్గాలు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఏది ఏమైనా దిల్ రాజు, ఎస్ఎస్ రాజమౌళి ఏకమై తమ సొంత ప్రయోజనాల కోసం చినబాబు, నాగవంశీని ఇబ్బందుల్లో పడేశారనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. అంతేకాకుండా వారిద్దరిపై పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యేలా రాజమౌళి, దిల్ రాజు చేశారనే అసంతృప్తి వ్యక్తమవుతున్నది.

    English summary
    Pawan Kalayn's Bheemla Naik release postponed from January 12th to February. In this occasion, SS Rajamouli made serial tweets. In this occassion, Pawan Kalyan Fans fire on SS Rajamouli, Dil Raju.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X