twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భీమ్లా నాయక్ కు టీ.సర్కార్ బంపర్ ఆఫర్..15రోజుల పాటు స్పెషల్ పర్మిషన్!

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ 'భీమ్లా నాయక్'. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి భారీ అంచనాలున్నాయి. అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆ వివరాల్లోకి వెళ్తే

    భీమ్లా నాయక్ పేరుతో

    భీమ్లా నాయక్ పేరుతో


    మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాని తెలుగులో భీమ్లా నాయక్ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్ర దగ్గుబాటి రానా పోషిస్తూ ఉండగా మలయాళంలో బిజు మీనన్ పోషించిన పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. సినిమా అక్కడ ఉన్నది ఉన్నట్టు కాకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టు అనేక మార్పులు చేర్పులు చేశారు. మలయాళంలో ఈ సినిమా చూసిన సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగ వంశీ ఈ సినిమా హక్కులను ఆ వెంటనే కొన్నారు.

    ఐదవ షోకి అనుమతి

    ఐదవ షోకి అనుమతి

    ఈ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉండగా సినిమా ప్రమోషన్స్ కూడా ఇప్పటికే మొదలు పెట్టారు. ఫిబ్రవరి 23న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరుగుతుంది. ఈ సినిమాకి దర్శకత్వం సాగర్ కె చంద్ర కాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశారు. ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు.

    ఐదవ షోకి అనుమతి

    ఐదవ షోకి అనుమతి

    తాజాగా ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం బంపరాఫర్ ఇచ్చింది. రెండు వారాల పాటు ఐదవ షోకి అనుమతి ఇస్తున్నట్లు ప్రత్యేక జీవో ఒకదానిన తెలంగాణ ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. ఈ నెల 25న మూవీ రిలీజ్ కానుండగా.. మార్చి 11 వరకు రెండు వారాల పాటు ఐదో షో వేసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. థియేటర్లలో రద్దీ, బ్లాక్ టికెట్లను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

    టికెట్ రేట్లు పెంపు

    టికెట్ రేట్లు పెంపు

    'ఇక పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వడంతో ఈ సినిమాకు కొంత మేర టికెట్ రేట్లు పెంచారు థియేటర్ల యజమానులు. దీంతో చిత్ర యూనిట్ సహా పవన్ ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక ప్రభుత్వం ఇలా సౌలభ్యం ఇస్తే మరో పక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ సినిమా మీద ఆంక్షలు విధించడం చర్చనీయంశం అవుతోంది.

    Recommended Video

    Bheemla Nayak Pre Release : KTR For Pawan Kalyan's Event | Filmibeat Telugu
    ఏపీలో ఆంక్షలు

    ఏపీలో ఆంక్షలు

    జరుగుతున్న ప్రచారం మేరకు ఏపీలోని కొన్ని జిల్లాలలో 'భీమ్లా నాయక్‌' ప్రదర్శించే ఎగ్జిబిటర్లతో అధికారులు సమావేశాలు నిర్వహించడమే కాకుండా.. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధరలు ఉండాలంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేశారని, కొన్ని చోట్ల నోటీసులు కూడా ఇచ్చారని అంటున్నారు. ఎక్కడా బెనిఫిట్ షో వేయకూడదని, ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా చేసినట్లు తెలుస్తోంది. పాత ధరలకే టికెట్‌లు విక్రయించాలంటూ ఎగ్జిబిటర్లకు అధికారులు చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి ఈ వ్యవహారం ఎన్నాళ్ళు కొనసాగుతుంది అనేది.

    English summary
    Bheemla Nayak 5th show permission granted in telangana by government
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X