Bheemla Nayak First Glimpse: విడుదలైన కొన్ని గంటల్లోనే అందరి లెక్కలు తేల్చేసిన పవర్ స్టార్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి మొదటి సారి కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా భీమ్లా నాయక్ అంచనాల డోసును మరింత పెంచేసింది. గతంలో ఎలాంటి సినిమాలు చేసినా కూడా సోలో హీరో గానే కిక్కు ఇచ్చిన పవర్ స్టార్ ఈ సారి మరో హీరోతో కలిసి పోటాపోటీగా నటించబోతున్నాడు అంటే బాక్సాఫీస్ వద్ద వాతావరణం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళం బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఇక ఈ సినిమా విడుదలకు చాలా సమయం ఉన్నప్పటికీ చిత్ర యూనిట్ ముందుగానే భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తోంది.

మొత్తానికి సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ ను నేడు ఉదయం ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హై వోల్టేజ్ యాక్షన్ లుక్ తో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ టీజర్ లోనే తన డైలాగ్స్ తో అదరగొట్టేశాడు. ఇక ఈ సినిమాలో రానా దగ్గుబాటి డానియల్ శేఖర్ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఇక అతన్ని తిట్టుకుంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విలన్స్ ను చితకొట్టడం ఫస్ట్ గ్లింప్స్‌ లో అభిమానులకు బాగా నచ్చేసింది. ఇక ఈ ఫస్ట్ గ్లింప్స్‌ పాత రికార్డులను ఒక్కసారి బ్లాక్ చేసింది. ఇప్పటివరకు యూట్యూబ్ లో విడుదలైన టాలీవుడ్ సినిమాల ఫస్ట్ గ్లింప్స్‌ లలో ఏది కూడా ఈ స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేదు.

Bheemla Nayak First Glimpse new record in youtube fastest likes

విడుదలైన నాలుగు గంటల్లోనే అత్యధిక వేగంగా 400 యూట్యూబ్ లైక్స్ అందుకున్న ఫస్ట్ గ్లింప్స్‌ గా భీమ్లా నాయక్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో కూడా ఈ స్థాయిలో ఫస్ట్ గ్లింప్స్‌ తో రికార్డులు సృష్టించలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించాడు. నెంబర్ వన్ స్థానానికి పోటీ గా నిలుస్తూ ఒక విధంగా బాక్స్ ఆఫీస్ కు హెచ్చరిక కూడా పంపాడు. సినిమా తప్పకుండా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని కూడా కామెంట్స్ వస్తున్నాయి. సంక్రాంతి భరిలో ఎన్ని సినిమాలు ఉన్నా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే రాణా దగ్గుబాటి ఇద్దరు కలిసి వారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకోవచ్చని తెలుస్తోంది.

Recommended Video

Vihari tweets about Pspk rana movie | Filmibeat Telugu

ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందిస్తుండగా సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. నాగ వంశీ నిర్మాతగా కొనసాగుతుండగా తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటను విడుదల చేయబోతున్నారు. ఫస్ట్ గ్లింప్స్‌ తోనే భారీస్థాయిలో బజ్ క్రియేట్ చేసిన భీమ్లా నాయక్ ఇక ఫస్ట్ పాటతో ఇంకా ఏ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X