బ్రేకింగ్: Bheemla Nayak ప్రీ రిలీజ్ వాయిదా.. పవన్ కల్యాణ్ ప్రకటనలో చెప్పిందేమిటంటే?

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి మరణవార్త తెలుగు రాష్ట్రాల ప్రజలను విషాదానికి గురిచేసింది. సోమవారం ఉదయమే గౌతమ్ రెడ్డి మరణించారనే వార్త అందర్నీ తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వాయిదా వేస్తున్నట్టు సితారా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితే..

యూసఫ్ గూడలో ఏర్పాట్లు

యూసఫ్ గూడలో ఏర్పాట్లు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఫిబ్రవరి 25వ తేదీన రిలీజ్ కానున్నది. అయితే ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్‌లో వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఈ వేడుకకు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు.

మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో

మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో

అయితే సోమవారం ఉదయం ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో కుప్పకూలాడు. ఆయనను వెంటనే హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌కు తరలించారు. గౌతమ్ రెడ్డి ప్రాణాలను కాపాడేందుకు 90 నిమిషాలపాటు వైద్యులు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన అప్పటికే ప్రాణాలు వదిలారనే అపోలో హాస్పిటల్‌లో అధికారికంగా ప్రకటించారు. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు విషాదంలోకి జారుకొన్నారు.

నిర్మాత నాగవంశీ నిర్ణయంతో

నిర్మాత నాగవంశీ నిర్ణయంతో


మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు విషాదంలో మూగబోయారు. ఇలాంటి పరిస్థితుల్లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వాయిదా వేయాలని చిత్ర నిర్మాత నాగవంశీ నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటనను సితారా ఎంటర్‌టైన్‌మెంట్ విడుదల చేసింది.

సితారా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకటన

సితారా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకటన

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వాయిదా వేసినట్టు సితారా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకటనను విడుదల చేస్తూ.. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో దిగ్బ్రాంతికి గురయ్యాం. ఆయన కుటుంబానికి, స్నేహితులకు మా ప్రగాఢ సంతాపం. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని కోరుకొంటూ.. మేము ఫిబ్రవరి 21న తలపెట్టిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వాయిదా వేస్తున్నాం. ఈ రోజు నిర్వహించడం లేదని తెలియజేస్తున్నాం అని తెలిపింది.

పవన్ కల్యాణ్ అధికార ప్రకటన

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో కీలక బాధ్యతల్లో ఉన్న శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు హఠాన్మరణం వల్ల నెలకొన్న ఈ విషాద సమయంలో భీమ్లా నాయక్ సినిమా వేడుక చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. అందుకే నేడు జరగవలసిన భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించాం. ఈ వేడుక త్వరలోనే జరుగుతుంది. వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ తెలియచేస్తుంది అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X