twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    29న వైజాగ్‌లో 'భీష్మ' హల్‌చల్.. ఘనంగా విజయోత్సవ వేడుకలు

    |

    యువ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం 'భీష్మ. ఈ మూవీ ఫిబ్రవరి 21న విడుదలై ఘన విజయం సాధించింది. హీరో నితిన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ఈ చిత్రం. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో రష్మికా మందన్న నాయిక. వెంకీ కుడుముల దర్శకుడు.

    ప్రపంచవ్యాప్తంగా చిత్రం సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని వైభవంగా ఓ వేడుకను జరపాలని నిర్ణయించుకున్నారు చిత్ర యూనిట్. వాటి వివరాల్లోకి వెళితే...ఈ నెల 29 న వైజాగ్ లోని 'గురజాడ కళాకేత్రం' లో 'భీష్మ' చిత్ర విజయోత్సవ వేడుక ను నిర్వహించ నున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. హీరో నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలచిన 'భీష్మ' వేడుకను, ఇంతటి ఘన విజయాన్ని తమకు అందించిన ప్రేక్షకాభిమానుల సమక్షంలోనే నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

    Bheeshma success meet at Vizag February 29th

    శనివారం( 29 ) సాయంత్రం వైజాగ్, వుడా కాంప్లెక్స్, సిరిపురం లోని 'గురజాడ కళాకేత్రం' లో 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ విజయోత్సవ వేడుకలో చిత్రకథానాయకుడు నితిన్, నాయిక రష్మిక మందన్న లతోపాటు చిత్రం లోని ఇతర ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణులు పాల్గొంటున్నారు. ఆరోజు జరిగే వేడుక ఆద్యంతం అభిమానులను అలరించనుంది.

    ఇక భీష్మ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లను సాధిస్తున్నది. ఇప్పటికే సుమారు 50 కోట్ల గ్రాస్ వసూళ్లకు చేరువైంది. యూఎస్‌లో మిలియన్ డాలర్ కలెక్షన్లను సొంతం చేసుకొన్నది.

    English summary
    Bheeshma movie is going good at box office. This film unit to celebrate success meet at Vizag February 29th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X