రష్మికతో రొమాన్స్ చేశా గానీ! ఏడుపొస్తోంది.. కనిపించకూడదనే ఇలా చేశా: నితిన్ ఎమోషనల్ కామెంట్స్

యంగ్ హీరో నితిన్, క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా 'భీష్మ' ఫిబ్రవరి 21 వ తేదీన విడుదలైన ఈ సినిమా తొలిరోజే సక్సెస్ టాక్ తెచ్చుకొని నిర్మాతలను లాభాల బాటలోకి తీసుకొస్తోంది. ఆశించిన మేర ఫలితం రాబట్టడంతో ఖుషీ ఖుషీగా ఉన్న చిత్రయూనిట్ మంగళవారం రోజు సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన హీరో నితిన్.. భీష్మ షూటింగ్ సీక్రెట్ చెప్పి ఆకట్టుకున్నాడు. వివరాల్లోకి పోతే..

వరుస పరాజయాలు.. కసిగా నితిన్

వరుస పరాజయాలు.. కసిగా నితిన్

'అ..ఆ' సినిమా అనంతరం ఒక్క సక్సెస్ లేని నితిన్.. కొత్తగా ప్రయత్నిస్తూ వస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత వచ్చిన ''లై, ఛల్ మోహనరంగ, శ్రీనివాస కళ్యాణం'' వంటి చిత్రాలు వరుసగా బోల్తా కొట్టాడు. దీంతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే కసితో 'భీష్మ' రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అనుకున్నట్లుగానే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

అందరికంటే ఎక్కువ సంతోషం.. ఆసక్తికరంగా స్పీచ్

అందరికంటే ఎక్కువ సంతోషం.. ఆసక్తికరంగా స్పీచ్

భీష్మ హిట్ పట్ల అందరికంటే ఎక్కువగా నితిన్ ఆనంద పడుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇదే ఏడాది పెళ్లి పీటలేక్కబోతున్న నితిన్‌కి ఈ విజయం మంచి బూస్టింగ్ ఇచ్చింది. దీంతో అవధుల్లేని ఆనందంలో మునిగితేలుతున్న ఈ యంగ్ హీరో తాజాగా జరిగిన సక్సెస్ మీట్‌లో చిత్ర యూనిట్ మొత్తానికి థాంక్స్ చెబుతూ ఆసక్తికరంగా మాట్లాడాడు.

ఆనందంతో ఏడుపొస్తోంది.. అందుకే ఇలా!

ఆనందంతో ఏడుపొస్తోంది.. అందుకే ఇలా!

''భీష్మ సినిమాను ఇంత విజయవంతం చేసిందుకు ముందుగా ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాలుగేళ్ల తర్వాత హిట్ కొట్టాను. ఇక ఈ సినిమాతో డైరెక్టర్ వెంకీ తానేంటో నిరూపించుకుని చాలా మందికి సమాధానం చెప్పాడు. నాలుగేళ్ల తర్వాత కొట్టిన హిట్ కావడంతో నాకు ఆనందంతో ఏడుపొస్తోంది. అందుకే ఆ కన్నీళ్లు కనపడకుండా కళ్లజోడు పెట్టుకున్నాను. ఈ క్రెడిట్ అంతా వెంకీకే దక్కాలి. అతను సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో దగ్గరుండి చూశాను'' అన్నాడు నితిన్.

రష్మికతో నా రొమాన్స్ కంటే..

రష్మికతో నా రొమాన్స్ కంటే..

అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ గురించి మాట్లాడిన నితిన్.. ఆయన, తన సంగీతంలో సినిమాను మరో స్థాయి పైకి తీసుకెళ్లాడని చెప్పాడు. ఇక మా రష్మిక మేడమ్ గురించి మాట్లాడాలంటే అంటూ.. సినిమాలో మా ఇద్దరి రొమాన్స్ కంటే సంపత్ నందితో తాను చేసిన సీన్లనే ఎక్కువ ఎంజాయ్ చేశానని నితిన్ చెప్పాడు. రష్మిక మేడమ్ వెంకీకి తొలి హిట్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత నాకు ఓ హిట్ ఇచ్చారు. ఆవిడ ఇలాగే మరిన్ని విజయాలు అందుకోవాలని, ఇలాంటి పూల గౌన్లు వేసుకోవాలని కోరుకుంటున్నాను అని నితిన్ అన్నాడు.

Recommended Video

Rashmika Mandanna Speech At Bheeshma Pre Release Event || Filmibeat Telugu
 భీష్మ మూవీ.. పాజిటివ్ పాయింట్స్

భీష్మ మూవీ.. పాజిటివ్ పాయింట్స్

వెంకీ కుడుములు డైరెక్ట్ చేసిన 'భీష్మ' మూవీ క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది. చిత్రంలో నితిన్ హీరోగా నటించగా ఆయన సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న ఆడిపాడింది. వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు బాగా ప్లస్ అయింది. కామెడీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచి వసూళ్ల ప్రవాహం పారిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X