నితిన్ వెంటే వరుణ్ తేజ్.. యంగ్ హీరోతో ట్రిప్‌కి సిద్ధం.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
టాలీవుడ్‌లో యంగ్ హీరోల మధ్య స్నేహబంధం మరింత స్ట్రాంగ్ అవుతోంది. పోటీ సంగతి పక్కన బెడితే ఒకరి సినిమా కోసం మరొకరు తమ వంతు సహకారం అందిస్తూ తెలుగు చిత్రసీమలో ఉన్న ఫ్రెండ్లీ వాతావరణాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యంగ్ హీరో నితిన్ కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వైజాగ్ పయననానికి సిద్దమయ్యాడు.
నితిన్ లేటెస్ట్ మూవీ భీష్మ భారీ సక్సెస్ సాధించింది. ఈ మేరకు ప్రేక్షకులకు థాంక్స్ చెప్పేందుకు గాను ఫిబ్రవరి 29వ తేదీన వైజాగ్ లోని గురజాడ కళాక్షేత్రంలో భీష్మ థాంక్స్ మీట్ నిర్వహించబోతోంది చిత్రయూనిట్. అత్యంత గ్రాండ్‌గా నిర్వహించనున్న ఈ వేడుకకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు యూనిట్ సభ్యులు.

వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన 'భీష్మ' మూవీలో నితిన్ హీరోగా నటించగా, ఆయన సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న ఆడిపాడింది. ముందుగా ఊహించినట్లుగానే క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది ఈ సినిమా. వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు బాగా ప్లస్ అయింది. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ సినిమాకు కామెడీయే ప్రధాన బలంగా నిలిచి వసూళ్ల ప్రవాహం పారిస్తోంది.


Click it and Unblock the Notifications











