'అన్నవరం' దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు నటనావతారం
దర్శకుడు కాశీ విశ్వనాధ్ ని, కె.విశ్వనాధ్ ని ఫాలో అవటానికి దర్శకుడు భీమినేని శ్రీనివాస రావు రెడీ అవుతున్నారు. భీమినేని శ్రీనివాస రావు త్వరలో నటుడుగా అవతారమెత్తుతున్నారు.వరుణ్ సందేశ్ తాజా చిత్రం కుదిరితే కాఫీ కప్పు చిత్రంలో ఆయన వరుణ్ సందేశ్ తండ్రిగా చేస్తున్నారు. సుస్వాగతం చిత్రంలో రఘువరన్ తరహా క్యారెక్టరైజేషన్ తో ఈయన పాత్ర సాగనుందని తెలుస్తోంది. కొడుకుని స్నేహితుడిలా భావిస్తూ ఎంకరేజ్ చేసే ఈ పాత్రతో భీమినేని నటుడుగా కూడా బిజీ అవుతాడని యూనిట్ వారు అంటున్నారు. ఇక ఈ చిత్రం ద్వారా రమణ సెల్వా అనే కెమెరా మెన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఇక భీమినేని శ్రీనివాసరావు గతంలో పవన్ కళ్యాణ్ తో సుస్వాగతం, అన్నవరం చిత్రాలు రీమేక్ చేసారు. అలాగే జగపతిబాబుతో శుభమస్తు, శుభాకాంక్షలు చిత్రాలు, వెంకటేష్ తో సూర్యవంశం చిత్రాలను కూడా తెలుగులోకి రీమేక్ చేసారు. ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా పుడింగి అనే చిత్రం ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో వచ్చి హిట్టయిన తమిళ పదం చిత్రానికి ఇధి రీమేక్.


Click it and Unblock the Notifications











