twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి గారు వద్దన్నారు.. పవన్ రోజంతా అన్నం తినకుండా ఏడ్చాడు: భీమనేని

    |

    పవన్ కల్యాణ్ నటించిన చిత్రాల్లో 'సుస్వాగతం' ఒకటి. ఈ సినిమా ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు పవన్ కల్యాణ్‌లోని నటనను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇందులో అతడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. అంతేకాదు, 'సుస్వాగతం'లోని పాటలు, రఘువరన్ నటన, ప్రకాశ్ రాజ్ మేనరిజం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన భీమనేని శ్రీనివాసరావు తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.

    భీమనేని సినీ ప్రస్థానం

    భీమనేని సినీ ప్రస్థానం

    భీమనేని శ్రీనివాసరావు ‘శుభమస్తు' అనే సినిమాతో తెలుగు పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా ఇతర భాషలలో విడుదలై విజయవంతమైన పలు చిత్రాలను తెలుగులో కూడా విజయవంతం చేయడంలో తనదైన శైలి చూపించాడు. దర్శకత్వంతో పాటు పలు తెలుగు సినిమాలలో నటించాడు. అలాగే, ‘నీతోడు కావాలి' అనే సినిమా ద్వారా నిర్మాతగానూ మారాడు.

    సుస్వాగతంతో భారీ సక్సెస్

    సుస్వాగతంతో భారీ సక్సెస్

    సుస్వాగతం 1998లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథా చిత్రం. ఇందులో పవన్ కల్యాణ్, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, రఘువరన్, సుధ తదితరులు నటించారు. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో భీమనేని పేరు మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత బడా హీరోల సినిమాలకు సైతం దర్శకత్వం వహించే అవకాశాలు దక్కించుకున్నారు.

    పవన్ రోజంతా అన్నం తినకుండా ఏడ్చాడు

    పవన్ రోజంతా అన్నం తినకుండా ఏడ్చాడు

    సుస్వాగతం గురించి భీమనేని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సుస్వాగతం సినిమా ఎంతో సక్సెస్ అయింది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా రఘువరన్ చనిపోయే సమయంలో ఆయన యాక్టింగ్ హైలైట్ అని చెప్పాలి. సినిమాలో తండ్రి పాత్ర చనిపోయిన సమయంలో పవన్ నిజంగానే ఏడ్చాడు. ఒక రోజంతా అన్నం తినకుండా ఉండిపోయాడు' అని ఆయన వెల్లడించాడు.

    చిరంజీవి గారు వద్దన్నారు

    చిరంజీవి గారు వద్దన్నారు

    పవన్ కల్యాన్ నటించిన ‘అన్నవరం' సినిమా గురించి కూడా భీమనేని మాట్లాడారు. ‘అన్నవరం సినిమా తమిళం నుంచి తీసుకున్నది. దీన్ని మొదట చిరంజీవి గారికి చెప్పారు. ఆయన ఈ సినిమాను చేయనని అన్నారు. వయసు సెట్ అవదు కాబట్టి ఈ సినిమా నేను చేయలేను అన్నారు. అంతేకాదు, ఆయన పవన్ పేరును ప్రతిపాదించారు. పవన్ వెంటనే ఓకే చేసేసి డైరెక్టర్‌గా నన్ను తీసుకోమని సలహా ఇచ్చారు' అని భీమనేని చెప్పుకొచ్చారు.

    మంచి టాక్ వచ్చినా కలెక్షన్లు రాలేదు

    మంచి టాక్ వచ్చినా కలెక్షన్లు రాలేదు

    తెలుగు హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్‌, రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో.. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి'. ది క్రికెటర్‌ అనేది టాగ్‌లైన్‌. ఈ సినిమాను సీనియర్ ప్రొడ్యూసర్ కేఎస్‌ రామారావు సమర్పణలో కేఏ వల్లభ నిర్మించారు. ఈ సినిమా ఇటీవల విడుదలైంది. దీనికి మంచి పేరు వచ్చినప్పటికీ కలెక్షన్లు రాబట్టడంతో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

    English summary
    Bhimaneni Srinivasa Rao is a Telugu film director, producer, actor and writer from India. He is also known as a remake specialist. He had several hit films to his credit including Subhamastu, Subhakankshalu, Suswagatam and Suryavamsam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X