twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పొలిటికల్ సెటైర్ మూవీ అడ్డుకున్న ప్రభుత్వం: రూ. 20 లక్షలు ఫైన్ వేసి షాకిచ్చిన సుప్రీం కోర్ట్!

    |

    ఓ సినిమా ప్రదర్శన ఆపేందుకు ప్రయత్నించినందుకుగాను మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం కోర్ట్ రూ. 20 లక్షలు ఫైన్ వేసింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించారని పేర్కొంటూ కోర్టు ఈ పనిష్మెంట్ ఇచ్చింది. డబ్బును నిర్మాతతో పాటు థియేటర్ల ఓనర్లకు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది.

    అనిక్ దత్తా దర్శకత్వంలో రూపొందిన బెంగాళీ పొలిటికల్ సెటైర్ మూవీ 'భోబిష్యోటెర్ భూత్' అనే చిత్రం విడుదల కాకుండా మమతా బెనర్జీ ప్రభుత్వం అడ్డుకోవడంతో కోర్టు పై విధంగా స్పందించింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.

    రిలీజైన మరుసటిరోజే...

    రిలీజైన మరుసటిరోజే...

    ‘భోబిష్యోటెర్ భూత్' అనే సినిమా ఫిబ్రవరిలో విడుదలవ్వగా... మరుసటిరోజే పలు రాజకీయ కారణాలతో ఈ చిత్రాన్ని అన్ని మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్ థియేటర్లో ప్రదర్శన నిలిపి వేసేలా చేసింది మమత బెనర్జీ ప్రభుత్వం.

    దర్శకుడు అనిక్ దత్తా

    దర్శకుడు అనిక్ దత్తా

    దర్శకుడు అనిక్ దత్తా మాట్లాడుతూ... ‘నా సినిమా ప్రదర్శన రద్దు విషయంలో నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పై అధికారుల ఆదేశాల మేరకు సినిమా ప్రదర్శన ఆపివేసినట్లు తెలిపారు. ఆ సమయంలో నాకు అందరి నుంచి సపోర్ట్ లభించింది' అన్నారు.

    సెన్సార్ పాస్ అయ్యాక కూడా ఇలా చేశారు

    సెన్సార్ పాస్ అయ్యాక కూడా ఇలా చేశారు

    కొన్ని రోజుల క్రితం సినిమా ఆగిపోవడంపై అనిక్ దత్తా ఆవేదన వ్యక్తం చేస్తూ... ‘‘సినిమా సెన్సార్ బోర్డ్ నుంచి ఎలాంటి మేజర్ కట్స్ లేకుండా పాస్ అయినప్పటికీ... సినిమాను నిలిపివేశారు. సినిమాను రన్ చేసే బాధ్యత సినిమా థియేటర్ల ఓనర్లదే. కానీ వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు'' అన్నారు.

    ఏ రాజకీయ పార్టీ పేరు తీయలేదు

    ఏ రాజకీయ పార్టీ పేరు తీయలేదు

    ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషించిన కౌశిక్ సేన్ మాట్లాడుతూ... ‘ఈ సినిమా ఏ రాజకీయ పార్టీ పేరు ఎత్తకుండా ఇప్పుడున్న పొలిటికల్ సిస్టం తీరును విమర్శిస్తూ తీసిన చిత్రం. దీని వల్ల శాంతి భద్రతల సమస్య ఏలా ఏర్పడుతుంది? మాకు సరైన కారణం కూడా చెప్పకుండా సినిమా ఆపివేశారు' అన్నారు.

    English summary
    The Supreme Court has ordered the West Bengal government to pay a fine of Rs 20 lakh for attempting to stop the screening of Anik Dutta's political satire Bhobishyoter Bhoot. Just a day after Bhobishyoter Bhoot released in February this year, it was taken off from almost all multiplexes and single screen theatres in West Bengal for "political reasons".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X