'ఆంజనేయులు' డైరక్టర్ నెక్ట్స్ ఎవరితోనంటే...

By Srikanya

రవితేజ, నయనతార కాంబినేషన్లో ఆంజనేయులు చిత్రాన్ని రూపొందించిన పరుశరామ్ తాజాగా మరో స్క్రిప్టు ఓకే చేయించుకున్నారని సమాచారం. మగధీర, ఆర్య-2 చిత్రాల సహ నిర్మాతగా వ్యవహరించిన భోగవల్లి ప్రసాద్..పరుశరామ్ కథ నచ్చి సినిమా చేయటానికి ముందుకువచ్చారని తెలుస్తోంది. ఆంజనేయులు ఘోరంగా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకోవటంతో దర్శకుడుగా పరుశరామ్ కి గ్యాప్ వచ్చింది. అయితే ఆ గ్యాప్ ని సద్వినియోగం చేసుకుని మంచి స్క్రిప్టు రూపొందించాడని తెలుస్తోంది. ఇక పరుశరామ్ కిది మూడో చిత్రం. మొదటి చిత్రం నిఖిల్ హీరోగా రూపొందిన యువత. అలాగే పరుశరామ్..ప్రముఖ దర్శకుడు పూరీ దగ్గర పనిచేసారు. ఇక ఈ కొత్త చిత్రం ఓ క్రేజీ హీరోతో ఉండనుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X