»   » ఐదేళ్లు సహజీవనం: రేప్ కేసులో ప్రముఖ నటుడి అరెస్ట్

ఐదేళ్లు సహజీవనం: రేప్ కేసులో ప్రముఖ నటుడి అరెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రేప్ కేసులో ప్రముఖ భోజ్‌పురి నటుడు మనోజ్ పాండేను ముంబై పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పాండే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఇటీల ఓ మహిళ చార్‌కోప్ ఏరియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని ముంబైలో అరెస్టు చేశారు.

మనోజ్ పాండేతో గత ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు సదరు మహిళ పోలీసులకు వెల్లడించింది. సెప్టెంబర్ 15వ తేదీన అతడిపై రేప్ కేసు పెట్టింది. తన స్టేట్మెంటులో ఆమె సదరు నటుడు తనపై సంవత్సరాలగా అత్యాచారం చేస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం.

పెళ్లి చేసుకుంటానని మభ్య పెట్టి

పెళ్లి చేసుకుంటానని మభ్య పెట్టి

మనోజ్ పాండే తనను పెళ్లి చేసుకుంటానని మభ్య పెట్టి లైంగికంగా లొంగదీసుకున్నాడని ఆమె ఆరోపించారు.

చాలా ఎఫైర్లు

చాలా ఎఫైర్లు

తనతో రిలేషన్ షిప్ కొనసాగిస్తూనే మనోజ్ పాండే చాలా మందితో ఎఫైర్లు పెట్టుకున్నాడని, తనను ఒక స్టార్ గా పరిచయం చేసుకుంటూ చాలా మంది అమ్మాయిలను తనలాగే మోసం చేస్తున్నాడని ఆమె ఆరోపించారు.

పెళ్లి ఒత్తిడి

పెళ్లి ఒత్తిడి

పెళ్లి విషయంలో తాను ఒత్తిడి తేవడంతో తనను వదిలేసి మనోజ్ పాండే వెళ్లి పోయాడని... సదరు మహిళ ఆరోపించింది. ఫిర్యాదు అనంతరం పోలీసులు అతడిని పట్టుకునేందుకు పాండేను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

వివిధ సెక్షన్ల కింద కేసులు

వివిధ సెక్షన్ల కింద కేసులు

పాండే మీద ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 395/17, 376, 317, 406, 506(2) మొదలగు వాటికింద కేసు నమోదు చేశారు.

English summary
The Charkop Police has arrested Bhojpuri actor Manoj Pandey in an alleged rape case. A woman, who claimed to be in a live in relationship with the actor for five years, had filed the complaint on September 15 against the actor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu