నష్టాల ఊబిలో చిక్కుకుని దర్శకుడి ఆత్మహత్య: సొంత అపార్ట్మెంట్‌లో ఉరి వేసుకొని

తాజాగా భోజ్‌పురి చిత్రాల దర్శకుడు షాద్ కుమార్ ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. షాద్ కుమార్ అసలు పేరు షంషాద్ అహ్మద్.

Recommended Video

ఉరి వేసుకొని దర్శకుడి ఆత్మహత్య !

సినిమా ఇండస్ట్రీలోకి ఎన్నో కలలు కని వస్తారు. ఒక్కసారి తెరపై కానీ, తెర వెనుక కానీ చాన్స్ దొరికితే చాలు అనుకునే వారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా దర్శకత్వం, నటించడం అంటే చాలా మంది యువతకు ఎంతో పుణ్యం చేస్తే దక్కే అవకాశం అని భావిస్తారు. అలాంటి సినిమా ఇండస్ట్రీకి వచ్చి కష్టాలు, కన్నీళ్ల పాలు అయ్యే వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విషాదాలు చోటు చేసుకున్నాయి.

 షాద్ కుమార్

షాద్ కుమార్

తాజాగా భోజ్‌పురి చిత్రాల దర్శకుడు షాద్ కుమార్ ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. షాద్ కుమార్ అసలు పేరు షంషాద్ అహ్మద్. 49 సంవత్సరాల షాద్ కుమార్ నిన్న మధ్యాహ్నం తాను నివసించే న్యూ సలోని హైట్స్ కో ఆపరేటివ్ సొసైటీలోని తన అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 షంషాద్ భార్య భానో

షంషాద్ భార్య భానో

అంతకుముందే బయటికి వెళ్ళిన షంషాద్ భార్య భానో తిఒరిగి వచ్చేసరికి సీలింగ్ కి వేలాడుతున్న భర్త శరీరాన్ని చూసి చుట్టుపక్కల వారికి చెప్పి, పోలీసులకు కూడా సమాచారం అందించింది. త్న మరణానికి కారణాలు చ్ప్తూ సూసైడ్ నోట్ ఏమైనా రాసాడేమో వెతికిన పోలీసులకు అలాంటిదేమీ కనిపించలేదు.

కొంతకాలంగా మనస్థాపం

కొంతకాలంగా మనస్థాపం

తీసిన సినిమాలన్నీ వరుసగా పరాజయం పాలవటంతో, మానసికంగానూ, ఆర్థికంగాను చితికిపోయిన షంషాద్ కొంతకాలంగా మనస్థాపంతో ఉన్నాడని బోనా పోలీసులకు తెలిపింది. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విపరీతమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడట

విపరీతమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడట

షంషాద్ దర్శకత్వంలో తెరకెక్కిన "ఏక్ లైలా-టీన్ చైలా", "బెయిల్ తోహ్రా సె ప్యార్", "తుమ్హారే ప్యార్ కె కసమ్" వంటి పలు భోజ్‌పురి చిత్రాలు విజయవంతమయ్యాయి. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు వరుస పరాజయాలని చవి చూడటంతో విపరీతమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడట షంషాద్.

 తాజా చిత్రం

తాజా చిత్రం "స్వర్గ్"

ఆయన తాజా చిత్రం "స్వర్గ్" ఈనెల 24న విడుదల కావాల్సి ఉంది. అయితే స్వర్గ్ విషయంలో కూడా పరాజయం పొందవచ్చనే అనుమానం కూడా లోలోపల వేదిస్తుండటం వల్లనే ఆ సినిమా విడుదలకి ముందే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడన్న మాటలూ వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X