మైనర్ బాలికపై రేప్.. ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్.. యువ గాయకుడి అరెస్ట్
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో భోజ్‌పురి గాయకుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. అమ్మాయికి మాయ మాటలు చెప్పి లైంగిక దాడి చేశారంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో గురుగ్రామ్ పోలీసులు రంగంలోకి దిగి యువ గాయకుడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..
భోజ్‌పురి సినిమా పరిశ్రమలో గాయకుడిగా రాణిస్తున్న 21 ఏళ్ల అభిషేక్ అలియాస్ బాబుల్ బిహారీ ప్రస్తుతం గురుగ్రామ్‌లోని రాజీవ్ నగర్‌లో నివసిస్తున్నాడు. అక్కడే ఉంటున్న 13 ఏళ్ల చిన్నారితో స్నేహంగా ఉంటున్నాడు. అయితే తనతో ఉన్న సాన్నిహిత్యాన్ని అసరాగా చేసుకొని ఆమెను హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అశ్లీలంగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వాటిని పోస్టు చేశాడు అని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు.

అయితే తనపై జరిగిన అత్యాచారం విషయాన్ని బయటకు చెప్పుకోలేక బాధితురాలి గుట్టుగా ఉంచింది. కొన్ని రోజుల తర్వాత ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ఆ ఫోటోలు మీడియాలో వైరల్ కావడంతో బాధితురాలి కుటుంబ సభ్యుల దృష్టికి వచ్చింది. దాంతో ఈ దుశ్చర్యను గురుగ్రామ్ పోలీసులకు తెలిపారు.
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో గురుగ్రామ్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిపై పోస్కో, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. నిందితుడిని అరెస్ట్ చేసి విచారించాం. ఆ తర్వాత స్థానిక కోర్టులో హాజరుపరిచి.. జైలుకు పంపాం అని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు.

భోజ్‌పురి గాయకుడు బాబుల్ బిహారీ వ్యవహారం సినీ పరిశ్రమ వర్గాలను షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనను పలువురు ఖండించి బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచారు. ఈ కేసులో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపింది.


Click it and Unblock the Notifications











