Bhola Shankar: చిరంజీవి అనిల్ సుంకర మధ్య పైసల్ పంచాయితీ.. అసలు విషయం ఏంటో చెప్పేశారు?

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం భోళా శంకర్. ఇక ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా విడుదల అయినప్పటి మొదటి రోజు నుంచి మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన రెమ్యూనరేషన్ విషయంలో చిత్ర నిర్మాతను చిరంజీవి ఇబ్బంది పెడుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఓ పోస్ట్ రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే....

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల్లో నటించడమే కాదు.. జనాలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ అందించడమే కాకుండా... ఇటీవల సినీ పరిశ్రమలో ఉండే కార్మికుల కోసం ఫ్రీ క్యాన్సర్ టెస్టులు అంటూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. అంతే కాదు.. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే.. తనకు తోచినంత సాయం చేయడంలో ముందుంటారు చిరంజీవి.

Bhola Shankar AK Entertainments Producer Anil Sunkara Clarity on Chiranjeevi Remuneration Dispute

అయితే చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్. ఇక ఈ మూవీకి బిల్లా, కంత్రి, శక్తి, షాడో వంటి చిత్రాలు తీసిన మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక చాలా మంది ఈ మూవీపై విమర్శలు, ట్రోలింగ్ చేస్తున్నారు. చిరంజీవి సరనస తమన్నా భాటియా నటించగా... కీర్తి సురేష్ చెల్లెలిగా నటించింది. సుశాంత్ కీలక పాత్రలో నటించారు. జబర్దస్త్ నటీనటులతో పాటు... శ్రీముఖి, రష్మి కూడా నటించారు.

అయితే గత కొంతకాలంగా భోళా శంకర్ నిర్మాత అనిల్ సుంకరకు, చిరంజీవికి విభేదాలు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. అంతే కాదు... ఈ సినిమాకు సంబంధించిన పారితోషికం విషయంలో చిత్ర నిర్మాతను చిరంజీవి ఇబ్బందిపెడుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. చిరంజీవికి పారితోషికం చెల్లించేందుకు నిర్మాత తన ఆస్తులను కూడా తాకట్టు పెడుతున్నట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ అంశంపై అలాంటి దేమి లేదని బేబి డైరెక్టర్ సాయి రాజేష్ కూడా క్లారీటి ఇచ్చారు. అయినా ప్రచారం మాత్రం తగ్గలేదు.

Bhola Shankar AK Entertainments Producer Anil Sunkara Clarity on Chiranjeevi Remuneration Dispute

ఇటీవల సోషల్ మీడియాలో భోళా శంకర్ నిర్మాత అనిల్ సుంకర వాట్సాప్ చాట్ లీక్ అంటూ వార్తలు వచ్చాయి. అందులో ...సార్ రెమ్యునరేషన్ విషయంలో వస్తున్న వార్తలు నిజమేనా?" అంటూ నిర్మాతకు మెసేజ్ చేశాడు. దానికి "అలాంటిదేం లేదు. నేను ఫ్లైట్ లో యూఎస్ వెళ్తున్నా" అని రిప్లై ఇచ్చారు అనిల్ సుంకర. తర్వాత ఓ వార్త లింక్ సెండ్ చేసి "ఈ న్యూస్ వైరల్ అవుతోంది సార్. కొద్దిగా చూడండి" అని అతను అడిగాడు. అతను పంపిన మెసేజ్ కు.. "పట్టించుకోవద్దండి. నేను చిరంజీవి గారితో మరో సినిమా తీయబోతున్నా. చిరంజీవి చాలా మంచి వ్యక్తి, జెన్యూన్ పర్సన్.. అని అనిల్ సుంకర సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ చాట్ నెట్టింట్లో తెగ గింగిరాలు తిరుగుతోంది.

ఇప్పుడు తాజాగా ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఓ పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అన్ని అబద్ధపు వార్తలే. అందులో ఒక్క శాతం కూడా నిజం లేదు. అవన్నీ బేస్ లెస్, సెన్స్ లెస్ వార్తలు. ప్రతి ఒక్కరికీ దయతో కోరుతున్నాం.. అలాంటి వార్తలను నమ్మి.. అనవసరపు చర్చలు జరపవద్దు.. అంటూ రాసుకొచ్చింది. దీనితో చిరంజీవి పారితోషికంపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X