Bhola Shankar: చిరంజీవితో విబేధాలు.. నిర్మాత అనిల్ సుంకర షాకింగ్ ట్వీట్

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సూపర్ హిట్టు తర్వాత నటించిన చిత్రం భోళా శంకర్. ఇక ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయింది.

రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఇక ఈ సినిమా రెమ్యూనరేషన్ విషయంలో చిరంజీవి... చిత్ర నిర్మాతను ఇబ్బంది పెడుతున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజా ఈ చిత్ర నిర్మాత ఈ విషయంపై షాకింగ్ ట్వీట్ చేశారు. ఆ వివరాలు....

Bhola Shankar Movie Producer Anil Sunkara Shocking Tweet on Chiranjeevi Remuneration Dispute

సెకండ్ ఇన్నింగ్స్ లో మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ.. ముందుకెళ్తున్నారు. ఈ వయసులోనూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తూ చిరంజీవి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్య సినిమాతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించారు. ఇక ఆ సినిమా తర్వాత ఎన్నో అంచనాలతో మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా రిలీజ్ అయింది.

ఇక భోళా శంకర్ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి మిక్స్ డ్ టాక్ రావడంతో కలెక్షన్లు డీలా పడుతూ వచ్చాయి. ఇక ఈ మూవీలో చిరంజీవి సరసన తమన్నా భాటియా నటించగా ఆయన చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. సుశాంత్ ఒక కీలక పాత్రలో నటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.

Bhola Shankar Movie Producer Anil Sunkara

అయితే గత కొద్ది రోజులుగా రెమ్యూనరేషన్ విషయంలో చిరంజీవికి, చిత్ర నిర్మాతకు విభేదాలు వచ్చాయని... చిరంజీవి, అనిల్ సుంకరను రెమ్యూనరేషన్ గురించి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇల్లు, ఆస్తుల అమ్మి మరీ నిర్మాత చిరంజీవికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేశారని అంటూ కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ వార్తలపై స్పందించింది కూడా. అవన్నీ అవాస్తవ వార్తలు అంటూ కొట్టి పారేసింది.

ఇప్పుడు తాజాగా భోళా శంకర్ నిర్మాత అనిల్ సుంకర షాకింగ్ పోస్ట్ చేశారు. చిరంజీవి తో విభేదాలు అంటూ వస్తున్న వార్తల గురించి స్పందించారు. కొంతమంది కావాలనే ఇలాంటి రూమర్స్ సృష్టిస్తున్నారంటూ అనిల్ సుంకర తన ట్వీట్లో పేర్కొన్నారు. ఎంతో కష్టపడి నిర్మించుకున్న ప్రతిష్టను దెబ్బతీయడం కోసమే ఇలా చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తనకు చిరంజీవికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

అనిల్ సుంకర ట్వీట్ లో.... ''మా మధ్య విభేదాలు అనేది పూర్తిగా అవాస్తవం. చిరంజీవి నాకు పూర్తి మద్దతును ఇచ్చారు. అతను మామూలుగా అందరితో మంచి సంబంధాలను కొనసాగిస్తారు. నాకు చిరంజీవికి మంచి సంబంధాలు అయితే ఉన్నాయి. ఇలాంటి నకిలీ వార్తల సృష్టించడం కొంతమందికి వినోదంగా ఉండవచ్చు. కానీ అది అందులో ఉన్నవారికి సమస్యలను తీసుకొస్తుంది. ఈ పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేసిన పరిశ్రమలోని నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు. వారందరి ఆశీస్సులతో మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటున్నాను... అంటూ షాకింగ్ పోస్ట్ చేశారు.

దీనితో చిరంజీవికి, అనిల్ సుంకరకు మధ్య విభేదాలు లేనట్టు స్పష్టమవుతుంది. చిరంజీవి రెమ్యూనిరేషన్ కోసం అనిల్ సుంకరను ఇబ్బంది పెట్టారంటూ వచ్చే వార్తలు అవాస్తవమని అర్థమవుతుంది. ఇప్పటికే అనిల్ సుంకరతో చిరంజీవి సినిమా చేస్తారంటూ ఇంతకు ముందు చెప్పుకొచ్చారు. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అనేది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X