Bhola Shankar నిర్మాతను ఇబ్బంది పెడుతున్న చిరంజీవి? లీకైనా వాట్సాప్ చాట్

స్వయంకృషితో ఎదిగి మెగాస్టార్ గా అశేష ప్రేక్షకుల మన్ననలు పొందారు చిరంజీవి. తనదైన గ్రేస్, డ్యాన్స్, ఫైటింగ్స్ తో ఎంతోకాలంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అలరిస్తున్నారు. గతేడాది గాడ్ ఫాదర్ సినిమాతో మంచి విజయం అందుకున్న ఆయన ఈ సంవత్సరం వాల్తేరు వీరయ్యగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.

తాజాగా భోళా శంకర్ సినిమాతో ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పారితోషికం విషయంలో చిత్ర నిర్మాతను చిరంజీవి ఇబ్బందిపెడుతున్నారంటూ వార్తలు హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో లీకైనా నిర్మాత అనిల్ సుంకర్ వాట్సాప్ చాట్ హాట్ టాపిక్ గా మారింది.

Bhola Shankar Producer Anil Sunkara About Chiranjeevi Remuneration Whatsapp Chat Leaked

బిల్లా డైరెక్టర్: మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం భోళా శంకర్. పదేళ్ల క్రితం తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వేదాళం సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో చిరుకు జోడాగీ మిల్కీ బ్యూటి తమన్నా, చెల్లెలుగా మహానటి కీర్తి సురేష్ నటించారు. హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాకు బిల్లా డైరెక్టర్ మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు. ఏకే ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరించారు.

Bhola Shankar Producer Anil Sunkara About Chiranjeevi Remuneration Whatsapp Chat Leaked

వర్కౌట్ కాలేదంటూ: సిస్టర్ సెంటిమెంట్ ప్రధానాంశంగా వచ్చిన భోళా శంకర్ మూవీ ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమాపై ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. బ్రిటిష్ కాలం నాటి స్టోరీతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారని పలు రివ్యూలు చెప్పాయి. ఇక ఇందులో మిగతా సినిమాల్లోని స్ఫూఫ్ వీడియోలు కూడా అంతగా వర్కౌట్ కాలేదని అంటున్నారు. తొలి రోజు కలెక్షన్స్ బాగా చేసిన తర్వాత డీలా పడ్డాయి.

Bhola Shankar Producer Anil Sunkara About Chiranjeevi Remuneration Whatsapp Chat Leaked

ఆస్తులు అమ్మి: ఈ నేపథ్యంలో చిరంజీవి తన రెమ్యునరేషన్ గురించి నిర్మాత అనిల్ సుంకరను ఇబ్బంది పెడుతున్నారనే వార్త జోరుగా ప్రచారం అయింది. అంతేకాకుండా చిరుకి పారితోషికం చెల్లించేందుకు నిర్మాత తన ఆస్తులను కూడా తాకట్టు పెడుతున్నట్లు సోషల్ మీడియాలో భారీగా చర్చ జరిగింది. అయితే ఈ అంశంపై అలాంటిదేం లేదని బేబి డైరెక్టర్ సాయి రాజేష్ క్లారీటి ఇచ్చారు. అయినా ప్రచారం తగ్గలేదు.

Bhola Shankar Producer Anil Sunkara About Chiranjeevi Remuneration Whatsapp Chat Leaked

వైరల్ అవుతోంది: తాజాగా సోషల్ మీడియాలో భోళా శంకర్ నిర్మాత అనిల్ సుంకర వాట్సాప్ చాట్ ప్రత్యక్షమైంది. అందులో ఒకతను "సార్ రెమ్యునరేషన్ విషయంలో వస్తున్న వార్తలు నిజమేనా?" అంటూ నిర్మాతకు మెసేజ్ చేశాడు. దానికి "అలాంటిదేం లేదు. నేను ఫ్లైట్ లో యూఎస్ వెళ్తున్నా" అని రిప్లై ఇచ్చారు అనిల్ సుంకర. తర్వాత ఓ వార్త లింక్ సెండ్ చేసి "ఈ న్యూస్ వైరల్ అవుతోంది సార్. కొద్దిగా చూడండి" అని అతను అడిగాడు.

Bhola Shankar Producer Anil Sunkara About Chiranjeevi Remuneration Whatsapp Chat Leaked

సమాధానం ఇస్తా: అతను పంపిన మెసేజ్ కు.. "పట్టించుకోవద్దండి. నేను చిరంజీవి గారితో మరో సినిమా తీయబోతున్నా. చిరంజీవి చాలా మంచి వ్యక్తి, జెన్యూన్ పర్సన్. వాళ్ల ప్రశ్నలన్నింటికీ సినిమాతోనే సమాధానం చెబుతాం" అన్నట్లుగా భోళా శంకర్ నిర్మాత అనిల్ సుంకర సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ చాట్ నెట్టింట్లో తెగ గింగిరాలు తిరుగుతోంది. దీంతో చిరంజీవి పారితోషికంపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X