twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మొహమంతా రక్తం: పిచ్చెక్కించారు "భూమి" ఫస్ట్‌లుక్

    సంజ‌య్‌ద‌త్ 58వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న త‌దుప‌రి చిత్రం భూమి చిత్ర ఫస్ట్‌లుక్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌ను ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.

    |

    బాలీవుడ్ నటుడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అదితీరావు హైదరి సంజయ్‌దత్ కూతురు పాత్రలో కనిపించనుంది. తండ్రీ కూతుళ్ల మధ్య కొనసాగే అనుబంధం నేపథ్యంలో భూమి చిత్రం తెరకెక్కుతుంది. 2013లో వచ్చిన పీకే సినిమా తర్వాత సంజయ్‌దత్ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

    ఐదేళ్ల జైలు శిక్ష త‌ర్వాత ఎలాంటి సినిమాతో రీఎంట్రీ ఇవ్వాల‌ని ఆలోచించిన సంజూ భాయ్ ఎట్ట‌కేల‌కు త‌న స్థాయికి త‌గ్గ సినిమాతో వ‌స్తున్నాడు. ఇదివ‌ర‌కూ అమీర్‌ఖాన్ పీకేలో క‌నిపించినా, ఈసారి పూర్తి స్థాయిలో త‌న‌ని ఎలివేట్ చేసే క‌థాంశాన్ని, ద‌ర్శ‌కుడిని ఎంపిక చేసుకున్నాడు. టైటిల్ భూమి.

    Bhoomi New Poster Released on Sanjay Dutt's Birthday

    పేరుకు త‌గ్గ‌ట్టే ఈ సినిమా తండ్రి -కూతుళ్ల అనుబంధం నేప‌థ్యంలోని సినిమా. ఒమంగ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే ఈ సినిమా 2002లో సంజ‌య్ ద‌త్ న‌టించిన పితా సినిమాకి సిమ్మిల‌ర్‌గానే ఉంటుంద‌ని తెలుస్తోంది. అలాగే రీసెంటుగా రిలీజైన శ్రీ‌దేవి మామ్‌తోనూ పోలిక‌లు ఉంటాయిట‌. మామ్ త‌ల్లి కోణంలో న‌డిచే క‌థ‌. భూమి తండ్రి కోణంలో న‌డిచే క‌థ అంటూ చెబుతున్నారు.

    సంజ‌య్‌ద‌త్ 58వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న త‌దుప‌రి చిత్రం భూమి చిత్ర ఫస్ట్‌లుక్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌ను ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. సంజ‌య్‌ద‌త్ ట్వీట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ పోస్ట‌ర్ ట్విట్ట‌ర్‌లో ట్రెండ్‌గా మారింది. ఇందులో సంజ‌య్‌ద‌త్ కూతురిగా అథితిరావ్ హైద‌రీ న‌టిస్తోంది.

    ఈ పోస్ట‌ర్‌లో సంజ‌య్ ముఖం మీద ర‌క్తపు మ‌ర‌క‌ల‌తో, చెదిరిన గ‌డ్డంతో క‌నిపించారు. ఐదేళ్ల జైలు శిక్ష త‌ర్వాత విడుద‌ల‌వ‌బోతున్న సంజ‌య్ మొద‌టి చిత్రం ఇది. ఈ చిత్రానికి ఒమంగ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సెప్టెంబ‌ర్ 22న ఈ చిత్రం విడుద‌ల కానున్న‌ట్లు స‌మాచారం.

    English summary
    On the occasion of Sanjay Dutt's 58th birthday makers of Bhoomi has released a second poster of the film featuring the complete look of the actor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X