Don't Miss!
- News ఎండలో తిరిగితే జ్వరం..పూలు వేస్తే ఎలర్జీ..నీకు రాజకీయాలెందుకు..?
- Sports DC vs SRH:ట్రావిస్ హెడ్, షెహ్బాజ్ అహ్మద్ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
మొహమంతా రక్తం: పిచ్చెక్కించారు "భూమి" ఫస్ట్‌లుక్
సంజయ్‌దత్ 58వ పుట్టినరోజు సందర్భంగా ఆయన తదుపరి చిత్రం భూమి చిత్ర ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
బాలీవుడ్ నటుడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అదితీరావు హైదరి సంజయ్‌దత్ కూతురు పాత్రలో కనిపించనుంది. తండ్రీ కూతుళ్ల మధ్య కొనసాగే అనుబంధం నేపథ్యంలో భూమి చిత్రం తెరకెక్కుతుంది. 2013లో వచ్చిన పీకే సినిమా తర్వాత సంజయ్‌దత్ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఐదేళ్ల జైలు శిక్ష తర్వాత ఎలాంటి సినిమాతో రీఎంట్రీ ఇవ్వాలని ఆలోచించిన సంజూ భాయ్ ఎట్టకేలకు తన స్థాయికి తగ్గ సినిమాతో వస్తున్నాడు. ఇదివరకూ అమీర్‌ఖాన్ పీకేలో కనిపించినా, ఈసారి పూర్తి స్థాయిలో తనని ఎలివేట్ చేసే కథాంశాన్ని, దర్శకుడిని ఎంపిక చేసుకున్నాడు. టైటిల్ భూమి.
పేరుకు తగ్గట్టే ఈ సినిమా తండ్రి -కూతుళ్ల అనుబంధం నేపథ్యంలోని సినిమా. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా 2002లో సంజయ్ దత్ నటించిన పితా సినిమాకి సిమ్మిలర్గానే ఉంటుందని తెలుస్తోంది. అలాగే రీసెంటుగా రిలీజైన శ్రీదేవి మామ్‌తోనూ పోలికలు ఉంటాయిట. మామ్ తల్లి కోణంలో నడిచే కథ. భూమి తండ్రి కోణంలో నడిచే కథ అంటూ చెబుతున్నారు.
Here's presenting the first official poster of #Bhoomi! @BhoomiTheFilm @OmungKumar @TSeries @LegendStudios1 @aditiraohydari pic.twitter.com/GndKVEfZ6q
— Sanjay Dutt (@duttsanjay) July 29, 2017
సంజయ్‌దత్ 58వ పుట్టినరోజు సందర్భంగా ఆయన తదుపరి చిత్రం భూమి చిత్ర ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. సంజయ్‌దత్ ట్వీట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ పోస్టర్ ట్విట్టర్లో ట్రెండ్‌గా మారింది. ఇందులో సంజయ్‌దత్ కూతురిగా అథితిరావ్ హైదరీ నటిస్తోంది.
ఈ పోస్టర్లో సంజయ్ ముఖం మీద రక్తపు మరకలతో, చెదిరిన గడ్డంతో కనిపించారు. ఐదేళ్ల జైలు శిక్ష తర్వాత విడుదలవబోతున్న సంజయ్ మొదటి చిత్రం ఇది. ఈ చిత్రానికి ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 22న ఈ చిత్రం విడుదల కానున్నట్లు సమాచారం.