తేజ+భూమిక+కోడి రామకృష్ణ
భూమిక త్వరలో 'అలవేలు మంగ'గా కనిపించనుంది. కోడిరామకృష్ణ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రాన్ని మరో ప్రముఖ దర్శకుడు తేజ నిర్మిస్తున్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ కథగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. తమ పరిధిలో తాము పోరాడి తమ హక్కుల కోసం ఉద్యమించనున్న మహిళగా ఆమె అదరకొట్టనుందని తెలుస్తోంది. ఇక మిస్సమ్మ చిత్రం నుండి భూమిక వరసగా స్త్రీ ప్రధానమైన పాత్రలకు ప్రయారిటీ ఇస్తూ వస్తోంది. అందులోనూ ఆమె నటించిన మళయాళ చిత్రం 'భ్రమరం' అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకోవటంతో తిరిగి బిజీ అవుతోంది.ఇక కోడి రామకృష్ణ ఈ యేటి మేటి సూపర్ హిట్ అరుంధతిని ఇచ్చి యంగ్ డైరక్టర్స్ కి సవాల్ విసిరేలా సినిమాలు కమిట్ అవుతున్నారు. తాజాగా యమ్.యస్.రాజు బ్యానర్ లో కాజోల్ ప్రధాన పాత్రలో 'చండి' చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేగాక వినాయకుడు ఫేమ్ కృష్ణుడు తో మరో సోషియో ఫాంటసీ 'యమలోకంలో శీనుగాడు'కి స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. ఇంత బిజీలో భూమికతో ఓ చిత్రం ప్లాన్ చేయటం గ్రేటే కదా. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తున్నారు. ఇక తేజ తన'కేక' చిత్రం అనంతరం ఏ చిత్రాన్ని డైరక్ట్ చేయలేదు.


Click it and Unblock the Notifications











