తిరిగి తెలుగుకు వస్తున్న భూమిక
బాలీవుడ్ నుంచి తెలుగులోకి వచ్చి పెద్ద హీరోలతో నటించిన భూమిక మళ్ళీ తెలుగు తెర మీద కన్పించనుంది. మాయాబజార్ సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషించనుంది. బాలీవుడ్ నటీమణులు వలస పక్షుల వంటి వారు. ముంబాయి నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ కొన్ని విజయాలు నమోదు చేసుకుని వారు మళ్ళీ బాలీవుడ్‌కు వెళ్ళిపోవడం మామూలే. కేవలం డబ్బు కోసమే తెలుగు సినిమాల్లో నటిస్తున్నామని ముంబాయిలో చెప్పుకునే హీరోయిన్లు ఎంతో మంది. తెలుగు నుంచి మళ్ళీ బాలీవుడ్‌కు వెళ్ళిపోయిన భూమిక అక్కడ పెద్దగా రాణించలేకపోతోంది. ఆమె దక్షిణాదిని వదిలి వెళ్ళిపోవడానికి ఒక కారణం ఆమెకు తమిళ దర్శకుడు ఎస్‌జె సూర్యకు మధ్య ఎఫైర్ ఉందని ప్రచారం జరగడం. ఇప్పుడు తమిళంలో కూడా సూర్య-జ్యోతికల సినిమాలో ఆమె రెండో కథానాయికగా నటించడానికి అంగీకరించింది.


Click it and Unblock the Notifications











