మేం లేకుండా మీడియా.. ఎన్టీఆర్

ఈ సందర్బగా భూమిక మాట్లాడుతూ 'తెలుగు పరిశ్రమ నన్ను ఎంతగానో ఆదరించి అక్కున చేర్చుకుంది. అలాంటి పరిశ్రమకు నేను, మా వారు కలిసి రుణం తీర్చుకోవాలనుకున్నాం. అందులో భాగంగానే తెలుగులో సినిమాలను నిర్మించాలనుకుంటున్నాం. భరత్‌ఠాకూర్‌కు ఎప్పటినుంచో ఉన్న లక్ష్యం ఇది. నా సంకల్పం కూడా దానికి తోడయ్యింది. ఇవాళ మీ ముందు ఇలా నిలుచున్నాం'' అని భూమిక పేర్కొన్నారు.
డౌన్‌టౌన్ ఫిలిమ్స్ పతాకంపై కొత్త నటీనటులతో 'తకిట తకిట' అనే చిత్రాన్ని తొలుత రూపొందించనున్నారు. శ్రీహరి నాను దర్శకుడు. కోనవెంకట్ కథను సమకూరుస్తారు. సెంథిల్ ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తారు. ఈ చిత్రం ఈ నెలలోనే సెట్స్‌మీదకు వెళ్తుంది.ఈ కార్యక్రమంలో జగపతిబాబు, కె.యస్.రామారావు, వి.వి.వినాయక్, ఛోటా కె.నాయుడు, వరుణ్ సందేశ్, నిఖిల్, ఇలియానా, సుబ్బరాజు, సుహాని, గాయత్రి, మొనాలి చౌదరి తదితరులు పాల్గొని భూమిక దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.


Click it and Unblock the Notifications











