మరో సారి 'సింహాద్రి' కాంబినేషన్
తెలుగు సినిమా ఇండస్ర్టీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న కథానాయకుడు ఎన్టీఆర్. అలాగే పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ బిజీగా వుంటున్న నాయిక భూమిక. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'సింహాద్రి' చిత్రాన్ని ఎవ్వరూ మరచిపోలేరు. ఎన్టీఆర్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ చిత్రంగా ఈ సినిమా నిలచింది. తాజా ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రూపుదిద్దుకోబోతోందని సమాచారం.
భారీ చిత్రాలను రూపొందించడంలో దిట్టగా పేరొందిన గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్ర వివరాలు ఈ విధంగా వున్నాయి. గుణశేఖర్ ఎప్పటి నుంచో చెయ్యాలనుకుంటున్న తన డ్రీమ్ ప్రాజెక్టు 'రాణీ రుద్రమ' ఇప్పుడు కార్యరూపం దాల్చుకోబోతోందని సమాచారం. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకోబోతున్న ఈ చారిత్రాత్మక చిత్రంలో రాణీ రుద్రమగా భూమిక, కీలకమైన 'గోన గంగారెడ్డి' పాత్రను ఎన్టీఆర్ పోషిస్తున్నారని సమాచారం. ఇందులో గోన గంగారెడ్డి పాత్ర చాలా పవర్ ఫుల్ గా వుంటుందని సమాచారం. ఏదిఎలావున్నా 'అరుంధతి', 'మగధీర' వంటి చిత్రాల విజయాల ప్రేరణతో ఇంకా ఇలాంటి చారిత్రాత్మక చిత్రాలు మొదలు కావచ్చనేది నిర్వివాదాంశం.


Click it and Unblock the Notifications











