భూమిక హిట్ చిత్రం బాలీవుడ్ రీమేక్ గా
భూమిక,రవిబాబు కాంబినేషన్ లో వచ్చిన అనసూయ చిత్రం అప్పట్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్ లో పేరెన్నిక గన్న రిలియెన్స్ మరియు స్టూడియో 18 వారు తీసుకోవటానికి సన్నాహాలు చేస్తాన్నారు.ఈ మేరకు రవిబాబు ఆ కార్పోరేట్ సంస్ధవారు ఎప్రోచ్ అవటం జరిగింది.త్వరలోనే ఈ డీల్ ఓకే అవనున్నట్లు రవిబాబు చెప్తున్నారు.ఈ విషయమై రవిబాబు మాట్లాడుతూ..నిజమే..ఆ సినిమా రైట్స్ కోసం బాలీవుడ్ సంస్ధలు ఆసక్తి చూపెడుతున్నాయి.బాలీవుడ్ హీరోయిన్ ఒకరు భూమిక పాత్ర చేయటానికి వారు ఒప్పించారు.ఇక దర్శకుడు నేనా మరొకరా అనేది తెలియలేదు.అన్ని త్వరలోనే ఫైనలైజ్ అవుతాయనుకుంటున్నాను అన్నారు.అలాగే తన పాత్రకు బాలీవుడ్ లోని కొందరని తీసుకోదలచటానకి వారు ప్లాన్ చేసుకున్నారని చెప్పారు.ఇక మీరు డైరక్ట్ చేస్తారా అంటే ఎందుకు చేయలేను..అయితే నేను డెస్పరేట్ గా మాత్రం లేను అన్నారు.వరసగా ఇక్కడ కామిడీ సినిమాలు అక్కడ రీమేక్ రైట్స్ తీసుకుంటున్న నేపధ్యంలో అక్కడ నిర్మాతల కన్ను ఇక్కడ మిగిలిన చిత్రాలుపై కూడా పడింది.


Click it and Unblock the Notifications











