నాగార్జునకి, అనూష్కకీ ప్రత్యేక కృతజ్ఞతలు...భూమిక
మాపై అభిమానంతో ఈ చిత్రంలో అతిథి పాత్రలు పోషించిన అగ్ర కథానాయకుడు నాగార్జునతో పాటు మా స్వీటీ (అనుష్క)కు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం" అంటోంది భూమిక. కొత్తవాళ్లతో డౌన్ టౌన్ ఫిలింస్ పతాకంపై భూమిక సమర్పణలో ఇంటర్నేషనల్ యోగా గురు భరత్ ఠాకూర్ నిర్మించిన 'తకిట తకిట" 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకున్న సందర్భంగా భూమిక మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే... 'తొలి ప్రయత్నంగా మేము రూపొం దించిన 'తకిట తకిట" చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ స్ఫూర్తితో మరిన్ని మంచి చిత్రాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. అయితే ఈ మాటలు విన్న వారంతా నవ్వుకుంటున్నారు. సినిమా మొదటి రోజే ప్లాఫ్ టాక్ తెచ్చుకుందని, అలాంటిది హిట్టయిందని, 32 కేంద్రాల్లో యాభై రోజులు ఆడిందని ఎందుకు ఫైక్ పబ్లిసిటీ చేసుకోవటం అంటున్నారు. అలాగే నిజానికి నాగార్జున, అనూష్క సినిమాలో చేసిందేమీ లేదు. చివరకు ఓపినింగ్స్ రప్పించటానికి కూడా ఉపయోగపడలేదు.


Click it and Unblock the Notifications