ఎన్టీఆర్ ఉన్నాడని ప్రచారం జరుగుతోంది...నిజం లేదు
తారక్ లేడు! మా సినిమాలో జూ.ఎన్టీఆర్ ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. అందులో నిజం లేదు. ఇందులో కొత్తవారితో పాటు భూమిక, అనుష్క, నాగార్జున ఉన్నారు. అనుష్క, నాగార్జున స్టార్స్‌గానే కనిపిస్తారు. దాదాపు పావు గంట సేపు తెరపై వీరిద్దరూ కనువిందు చేస్తారు అంటున్నారు నిర్మాత భరత్ ఠాకూర్. ఆయన తాజాగా నిర్మించిన 'తకిట తకిట' చిత్రం రేపు(శుక్రవారం) విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే నాగార్జున, అనుష్క పాత్రలగురించి చెబుతూ..ఏదో అలా వచ్చి పోయే విధంగా వారి పాత్రలు ఉండవు అన్నారు.
సీన్స్ కు అనుగుణంగా చాలా చక్కగా ఉండే పాత్రలు వారివి. సినిమాకు క్రేజ్ వస్తుందనో, బిజినెస్ చేసుకోవాలనే ఉద్దేశంతోనో వాళ్ళను సినిమాలో పెట్టుకోలేదు. మా స్క్రిప్టు డిమాండ్ మేరకే వారిని ఎంపిక చేసుకున్నాం. భూమిక టీచర్ గా కనిపిస్తుంది. తనింత వరకు చేయని పాత్ర అది. అన్నారు. అలాగే "డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నేను సినిమా చేయలేదు. మంచి, ఆహ్లాదకరమైన, సకుటుంబంగా చూడదగ్గ తెలుగు సినిమాను తీయాలనుకున్నాను. 'తకిట తకిట' అంతటి మంచి సినిమా. 'తకిట తకిట'కు సంబంధించి ప్రతి సూక్ష్మమైన విషయాన్ని ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దాం.ఈ సినిమా అన్ని వర్గాల వారికీ సంతృప్తిని మిగులుస్తుందన్న నమ్మకం ఉంది అని చెప్పారు.


Click it and Unblock the Notifications











