twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భూమిక బిజినెస్ క్లోజ్

    By Staff
    |

    ఎంతో హైప్ తో హోప్ తో భూమిక మొదలెట్టిన 'మాయానగర్'పత్రిక మూతపడింది.భూమిక భర్త యోగా గురు భరత్ ఠాకూర్ ఈ పత్రికకు సంపాదకుడుగా వ్యవహరించేవారు. ఇక ఈ పత్రిక ఓపినింగ్ రోజు ఆమె మాట్లాడుతూ బయిట చాలా పోటీ ఉందని అయితే తాము సమర్ధవంతంగా నిర్వహించగలమని నమ్మకం ఉందని ఎంతో విశ్వాశంతో చెప్పుకొచ్చింది. అయితే ఆ కల చెరిగిపోయింది. ప్రతీ వారం పూర్తి స్ధాయి నష్టాలతో నడుస్తూండటంతో ఈ పత్రికను మూసివేసారని సమాచారం. అయితే స్టాఫ్ అందరికీ గొడవలు లేకుండా సెటిల్ చేసాకే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.ఇక నుంచి తాను నమ్ముకున్న నటనపైనే పూర్తి దృష్ణి పెట్టదలచినట్లు ఆమె నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. అలాగే ప్రస్తుతానికి డౌన్ టౌన్ ప్రొడక్షన్ హౌస్ మాత్రం ఏ విధమైన ఇబ్బంది లేకుండా రన్ అవుతోందని దాన్ని కంటెన్యూ చేయనుందని తెలిపారు. ప్రస్తుతం ఈ బ్యానర్ పై భూమికతో 'సత్యభామ'చిత్రాన్ని డైరక్ట్ చేసిన శ్రీహరి నాను ఓ చిత్రం రూపొందిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X