స్వలింగ వివాహంపై భూమి పెడ్నేకర్ కామెంట్స్.. దాని వల్లే తనకు ఫ్రెండ్స్..
ముంబైలో పుట్టి పెరిగిన బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్... చేసినవి తక్కువ సినిమాలు అయినా మంచి గుర్తింపు సాధించుకుంది. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా.. చిన్ననాటి నుంచే సినిమా మీద ఆసక్తితో నటన వైపు అడుగులు వేసింది. 2015 లో దమ్ లాగాకే హైషా అనే మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా ఈ భామ... తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా ఈ భామ తన బాయ్ ఫ్రెండ్ గురించి బయట పెట్టేసింది. ఆ వివరాలు...
మిస్టరీ బాయ్ ఫ్రెండ్...:పెద్దగా తెర మీద సందడి చేయని భూమి పెడ్నేకర్... కానీ మీడియాలో అతిగా ఈమె పేరు వినిపిస్తుంది. చేసింది కొన్ని చిత్రాలే అయినా.. భూమికి స్టార్ హీరోయిన్ కు ఉన్న క్రేజ్ ఉంటుంది. ఎప్పుడూ మీడియాలోకి ఎక్కే భూమి..తాజాగా ఆమె బాయ్ ఫ్రెండు గురించి బయట పెట్టింది. భూమి పెడ్నేకర్ తన బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ పుకార్లు బయటకు వస్తున్నాయి. అయితే ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరు.. ఏంటి అనే విషయాలు బయటకు వచ్చాయి.

అతనే యష్ కటారియా...:యష్ కటారియా 28 ఏళ్ల వ్యక్తి. ఈయన భారతదేశంలోని వ్యాపారవేత్తల్లో ఒకరు. అతను రకుల్‌ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని సహా బాలీవుడ్ ప్రముఖులకు చాలా సన్నిహితుడు. ఇక యష్, భూమి ఇన్ స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అనుసరిస్తున్నారు. అయితే, యష్ ఖాతా ప్రైవేట్‌గా ఉంది. అయితే సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీల రిసెప్షన్ లో భూమి, యష్ వీడియో వైరల్ కాగా.. ఈ వీడియో తొలగించారని తెలుస్తోంది.
స్వలింగ వివాహంపై కామెంట్స్:ఇక భూమి పెడ్నేకర్ స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేయడంపై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. దీనికి సంబంధించిన పిటిషన్ ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. దీనిపై ఆమె మాట్లాడుతూ... "వ్యక్తులుగా మనందరికీ జీవితంలోని ప్రతి అంశంలో సమానత్వం ఉండాలి. దేవుడు మనల్ని అదే థ్రెడ్ నుండి సృష్టించాడని నేను భావిస్తున్నాను అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

దాని వల్లే తనకు ఫ్రెండ్స్:పలు విషయాలపై మాట్లాడుతూ... "ఫిల్మ్‌ఫేర్ గెలవడం వ్యక్తిగత విజయం లాంటిది. కానీ ఈ చిత్రానికి దక్కిన ప్రేమ, ఆప్యాయతలు మొత్తం సమాజానికి విజయం లాంటిది. ఈ సినిమా అందుకున్న విజయం, ప్రేమ.. మన దేశం మారుతుంది అన్నదానికి నిదర్శనం. గతంలో అనేక సినిమాలు మార్పు తీసుకొచ్చాయి. ప్రస్తుతం మా చిత్రం సైతం మార్పు తీసుకురావడంలో భాగమైంది.నా కెరీర్లో బదాయి దో చిత్రం నాకెంతో ముఖ్యం. అది నా మనసును స్పృశించింది. ఆ సినిమా నాకు గే, లెస్బియన్, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, ఇంటర్‌సెక్స్, అసెక్సువల్(LGBTQIA+)కమ్యూనిటీకి చెందిన చాలా మంది స్నేహితులను అందించింది. వారిని నేను రిప్రెజెంట్ చేయడానికి నాకు ఓ చిన్న మార్గం దొరికింది. అది నాకెంతో సంతోషాన్నిచ్చింది. వారి సవాళ్లకు దొరికిన పరిష్కారంలో నేను భాగమని భావిస్తున్నాను."అంటూ చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











