నాగచైతన్య-రామ్ చరణ్ లతో భూమిక!
'ఖుషి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన భూమిక తన కెరియర్ ప్రారంభించి దాదాపు పదియేళ్ళయ్యింది చిత్ర ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ ని సంపాదించుకొంది. అనసూయ, మిస్సమ్మ, ఒక్కడు లాంటి సినిమాలలో నటించి తన గ్లామర్తో ప్రేక్షకులకు మిరింత దగ్గరయింది. పెళ్ళి చేసుకొని కూడా తన కెరియర్ని సక్సెస్ పుల్ గా కొనసాగిస్తోంది భూమిక. ఇటీవల ఒక సందర్భంలో మీడియాతో ముచ్చటించిన భూమిక-మరో పదేళ్ళు నా కెరియర్కి ఢోకి లేదు. ఇప్పుడు హీరోలుగా రంగప్రవేశం చేసిన రామ్ చరణ్ తేజ, నాగచైతన్య, రానాల సరసన కథానాయికగా నటించమని నన్నడిగినా నేను రెడీయే.
కానీ వదిన, అక్క పాత్రలు మాత్రం చెయ్యను. కథ బలం ఉన్న సజ్జెక్ట్ ఏదైనా నేను నటించటానికే సిద్ధమే అని చెప్పింది. ఇంత కాన్ఫిడెంట్ భూమికకి ఉండటానికి కారణం ఆమె ఫిగరే అని సిని వర్గాలు అంటున్నాయి. యోగా చేస్తూ తన బాడీని ఫిట్ గా ఉంచుకుంటున్న భూమిక నిజంగానే కుర్ర తారలా ఉందని పలువురు అంటున్నారు.


Click it and Unblock the Notifications











