నన్ను సోదరిలా తెలుగువారు...భూమిక
దశాబ్దంపైగా ఇక్కడ ఉంటున్నాను. నన్ను సోదరిలా ఆదరించారు. ఆ కృతజ్ఞతతో చిన్న బహుమతిని తెలుగువారికి ఇస్తున్నాను. అదే మా 'తకిట తకిట'. ప్రస్తుతం ఫైనల్ ఎడిటింగ్ జరుగుతోంది. జూన్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రతి ఫ్రేమునూ అద్భుతంగా తీర్చిదిద్దడానికి కాస్త సమయం పట్టింది. యువతను బాగా మెప్పిస్తుంద ని భూమిక చెప్పారు.
ఇక భూమిక ఈ 'తకిట తకిట'లో ఆంగ్ల అధ్యాపకురాలిగా నటిస్తోంది..మనం అనుకున్నవన్నీ జరిగితే అది జీవితమే కాదు. ఎదురయ్యే సమస్యలను ఆత్మస్త్థెర్యంతో ఎదుర్కొంటే బంగారు భవిష్యత్తు ముందుంటుందని నిరూపించే పాత్ర అది. అలాగే ఈ చిత్రానికి ఫైండ్ యువర్ రిథమ్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. అందరూ కొత్తవారితో భూమిక ముఖ్య పాత్ర చేస్తూ..నిర్మిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, అనుష్క గెస్ట్ రోల్స్ లో కనపడనున్నారు.
శ్రీహరి నాను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి భరత్ ఠాకూర్ నిర్మాత..నిర్మాత చిత్ర విశేషాలను చెబుతూ "సత్యభామ చిత్రీకరణ సమయంలో శ్రీహరి ఈ కథను చెప్పారు. మా సంస్థలో మంచి చిత్రాలను నిర్మించాలన్నదే ఆశయమ'ని చెప్పారు. "భూమిక, భరత్..నా కుటుంబ సభ్యుల్లాంటివాళ్లే. డౌన్ టౌన్ ఫిలిమ్స్ ఏ సినిమాను చేసినా తప్పకుండా నేను ఉంటాను. ఈ చిత్రంలో నేను అనుష్కగానే కనిపిస్తాను" అని అనుష్క తెలిపారు. ఛాయాగ్రహణం: కె.కె.సెంథిల్‌కుమార్, రచన: కోన వెంకట్, సంగీతం: బోబో శశి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బెక్కెం వేణుగోపాల్, కూర్పు: మార్తాండ్.కె.వెంకటేష్, కళ: ఎ.రామ్.


Click it and Unblock the Notifications











