Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇంతకీ భూమిక 'తకిట తకిట' మ్యాటరేంటి?
ఈ చిత్రంలో నేను ఇంగ్లిష్ టీచర్‌గా కనిపిస్తాను. పరోక్షంగా నా పాత్ర ద్వారా ఓ సందేశం వుంటుంది. ప్రేమను ప్రేమ ద్వారా జయించాలి అనేది ఈ చిత్రం కథాంశం అన్నారు భూమిక. శ్రీహరి నాను దర్శకత్వంలో భూమిక సమర్పిస్తున్న 'తకిట తకిట' చిత్రం జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూమిక మాట్లాడుతూ ఈ విధంగా చెప్పుకొచ్చింది.
"విభిన్నమైన సంస్కృతులు, వ్యక్తిత్వాల నుంచి వచ్చిన ఎనిమిది మంది స్నేహితుల మధ్య జరిగిన సంఘటనలు, వాటికి కారణమైన పొరపాట్లు, అపోహలు తాత్కాలికంగా వారిని విడదీసినా వారి మధ్య వున్న స్వచ్ఛమైన స్నేహం, అభిమానం వాళ్ళను ఎలా కలిపింది. ఎప్పటికీ విడిపోని అనుబంధంగా ఎలా మార్చింది...? విషయాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరిస్తున్నాం అందామె.
అలాగే నాగార్జున, అనుష్కలు ఈ చిత్రంలో హీరో, హీరోయిన్‌గానే కనిపిస్తారు. యూత్ కు రోల్ మోడల్ గా నిలిచే పాత్రలు వారివి. జూలైలో విడుదల కానున్న ఈ సినిమా అన్ని వర్గాలకు చేరువవుతుందనే నమ్మకం వుంది. మంచి చిత్రాలను అందించడమే ధ్యేయంగా మా సంస్థ పనిచేస్తుంది' అన్నారు..ఇక ఈ చిత్రానికి రచన: కోన వెంకట్, మాటలు: బివీఎస్ రవి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా: కె.కె.సెంథిల్ కుమార్, సంగీతం: బోబో శశి, సమర్పణ: భూమిక చావ్లా, నిర్మాత: భరత్ ఠాకూర్, నిర్మాణం: డౌన్‌టౌన్ ఫిలింస్.