భూమిక రూపంలో ఇండస్ట్రీకి కొత్త క్యారెక్టర్ దొరికింది, నెక్ట్స్ చైతుతో..
Recommended Video

'ఖుషి' సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంటరైన భూమి తొలి సినిమాతోనే తన అందం, నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమా తర్వాత ఒక్కడు, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన ఈ ఢిల్లీ బ్యూటీ.... మిస్సమ్మ, అనసూయ లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తనదైన ముద్ర వేసింది. కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న భూమిక నాని 'ఎంసీఏ' చిత్రం ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు.

‘ఎంసీఏ’లో భూమిక పాత్ర అదుర్స్
ఇటీవల విడుదలైన నాని ‘ఎంసీఏ' మూవీలో వదిన పాత్ర పోషించిన భూమిక ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఈ చిత్రంలో భూమిక పాత్ర హీరో నానికి ఏ మాత్రం తీసిపోకుండా డిజైన్ చేశారు.

భూమిక రూపంలో ఇండస్ట్రీకి కొత్త క్యారెక్టర్
‘ఎంసీఏ' సినిమాలో భూమిక నటన చూసిన వారంతా.... ఇండస్ట్రీకి కొత్త క్యారెక్టర్ దొరికిందని, రాబోయే సినిమాల్లో ఆమె కోసం కొత్తగా, విభిన్నంగా ఉండే పాత్రలు రాసే అవకాశం దక్కిందని పలువురు రచయితలు అంటున్నారు. ఎంసీఏ తర్వాత భూమిక మరో సినిమాకు కూడా కమిటైంది.

చైతూ సవ్యసాచిలో భూమిక
నాగచైతన్య కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సవ్యసాచి'. ఈ చిత్రంలో భూమిక కీలక పాత్రకు ఎంపికైంది. నాగ చైతన్యకు అక్క పాత్రలో కనిపించబోతోంది. ఈ మూవీలో ప్రముఖ సౌత్ స్టార్ మాధవన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్.

భూమిక చేస్తున్న ఇతర సినిమాలు
భూమిక ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, తమిళ చిత్రాలు కూడా చేస్తూ బిజీగా గడుపుతున్నారు. హిందీలో కామోషి అనే చిత్రంతో పాటు, తమిళంలో ప్రభుదేవా మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











