అంతా దేవుడే నిర్ణయిస్తాడు. .. మీ తల్లిని కలుసుకున్నావని భావిస్తున్నాను.. సుశాంత్‌పై భూమిక ఎమోషనల్
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సినీ లోకం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ హీరో ఇలా అర్దాంతరం మరణించడంపై యావత్ భారతావని స్పందిస్తోంది. డిప్రెషన్‌కు లోనైన సుశాంత్.. ఆత్మహత్య చేసుకోవడంపై నెటిజన్లు విచారాన్ని వ్యక్తం చేస్తున్నాడు. నేడు సుశాంత్‌కు సంబంధించిన విషయాలే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులతో పాటు సాధారణ ప్రజలు కూడా కోరుకున్నారు.

సుశాంత్ మృతి..
హీరో సుశాంత్ సింగ్ ఆదివారం ఉదయం బాంద్రాలోని తన నివాసంలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొంత కాలంగా డిప్రెషన్‌కు లోనైన సుశాంత్ ఇలా చివరకు తన చనువు చాలించాడు. సుశాంత్ మృతి పట్ల సోషల్ మీడియా మొత్తం సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది.

దేవుడే నిర్ణయిస్తాడు..
సుశాంత్ మరణ వార్త తెలిసి షాక్ అయ్యాను. మేము ఇద్దరం ఎంఎస్ ధోనిలో కలిసి నటించాము. ఈ వార్త విని హృదయం బద్దలైంది. జరిగింది ఏదైనా సరే అది చాలా బాధాకరం. మన జీవితంలో అందరం ఎత్తుపల్లాలు చూస్తాం. నీవు అన్ని మాట్లాడవని అనుకుంటాను.. వాస్తవం ఏంటంటే.. సమయం వచ్చినప్పుడు గడియారం కూడా ఆగిపోతుంది. దేవుడే నిర్ణయిస్తాడు. దాన్ని మనం ఎవ్వరం కూడా మార్చలేం. అతని కుటుంబానికి బలం చేకూరాలని ప్రార్థిస్తున్నా'ని పోస్ట్ చేసింది.

వెంట తీసుకెళ్లండి..
‘ఒక్కోసారి ప్రయాణం అనేది ప్రపంచాన్ని చుట్టి వచ్చేలా ఉంటుంది. అయితే ఒక్కోసారి మీ మనస్సుతో, ఆత్మతోనో అయి ఉంటుంది, కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక చిన్న సంచిని తప్పనిసరిగా తీసుకెళ్లండి. ఆ పుస్తకం ప్రార్థనలతో నిండి ఉండాలి.. ఎక్కడికి వెళ్లినా అది ఉండేలా చూసుకోవాలి.
Recommended Video

గమ్యస్థానానికి చేరుకున్నావని
నీవు నీ తుది గమ్యస్థానానికి చేరుకున్నావని ఆశిస్తున్నాను. అంతేకాకుండా మీ తల్లిని కలుసుకున్నావని భావిస్తున్నాము. ఇది చాలా హృదయ విదారకమైన సంఘటన. మీరు స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడాలని కోరుకుంటున్నారా.. వారు మీ నిశ్శబ్దాన్ని కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటాను. దేవుడు మీ కుటుంబానికి బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నిశ్శబ్దంలో కూరుకుపోయే ప్రతి ఒక్కరూ మాట్లాడండి.. అది కచ్చితంగా సాయపడుతుంది. చుట్టూ పక్కల ఉన్నవారు కూడా దయచేసి వినండ'ని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











