కష్టాల్లో భూమిక, భర్త వల్ల ఫ్యామిలీ మొత్తం..హాట్ ఫోటో షూట్‌కు కారణం ఇదే!

Recommended Video

Bhumika Chawla Latest Photo Shoot Goes Viral | Filmibeat Telugu

భూమిక చావ్లా పేరు చెప్పగానే.. టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్ తో చేసిన ఖుషి, ఒక్కడు, సింహాద్రి చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఈ చిత్రాలతో భూమిక టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. భూమిక అందాలకు, నటనకు ఇప్పటికి అభిమానులు ఉన్నారు. అయితే భూమిక 2007లో భరత్ ఠాకూర్ ని వివాహం చేసుకున్న సెటిల్ అయింది. పెళ్లి తర్వాత కూడా భూమిక తరచుగా చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. కాగా ఇటీవల భూమిక కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 బ్లాక్ బస్టర్ చిత్రంతో

బ్లాక్ బస్టర్ చిత్రంతో

యువకుడు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన భూమిక వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఖుషి చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించాడు. ఖుషి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో భూమికకు మంచి క్రేజ్ ఏర్పడింది. అదే జోరు కొనసాగిస్తూ మహేష్ బాబు సరసన ఒక్కడు చిత్రంలో, ఎన్టీఆర్ సరసన సింహాద్రి చిత్రంలో నటించి ఘనవిజయాలు సొంతం చేసుకుంది. తాను ప్రధాన పాత్రలో నటించిన మిస్సమ్మ చిత్రం కూడా విజయం సాధించింది.

పెళ్ళైన తర్వాత

పెళ్ళైన తర్వాత

భూమిక వివాహం తర్వాత కూడా సినిమాలని కొనసాగించింది. కానీ వివాహం తర్వాత ఆమెకు పెద్దగా కలసిరాలేదనే చెప్పాలి. సరైన విజయాలు దక్కలేదు. టాలీవుడ్ కు కాస్త గ్యాప్ ఇచ్చి నాని ఎంసీఏ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఎంసీఏ, యూటర్న్ చిత్రాలు బాగానే ఆడడంతో అదే జోరు కొనసాగించాలని భూమిక భావిస్తోంది.

ఆర్థిక ఇబ్బందులు

ఆర్థిక ఇబ్బందులు

ఇటీవల భూమిక కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఆమె భర్త చేస్తున్న వ్యాపారాలు నష్టాల పాలు కావడంతో నలువైపులా నుంచి భూమిక ఫ్యామిలీని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దీనితో భూమిక తిరిగి నటిగా రాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే టాలీవుడ్ లో తనకు ఉన్న పరిచయాలతో అవకాశాలు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తోందట. తమిళంలో కూడా తనకు పరిచయం ఉన్న దర్శక నిర్మాతలతో భూమిక సంప్రదింపులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

హాట్ ఫోటో షూట్

హాట్ ఫోటో షూట్

సినిమా అవకాశాల కోసం భూమిక గ్లామర్ అస్త్రాన్ని కూడా ప్రయోగిస్తోంది. ఇటీవల తరచుగా ఫోటో షూట్స్ చేస్తోంది. తాజాగా భూమిక చేసిన ఫోటో షూట్ నెటిజెన్లని ఆకట్టుకుంటోంది. చాలా కాలం తర్వాత భూమిక హాట్ లుక్ లో కనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. బ్లాక్ డ్రెస్ లో, ట్రెండీ లుక్ లో ఉన్న భూమిక ఫోటోలు వైరల్ అవుతున్నాయి. భూమిక చేస్తున్న ఈ ప్రయత్నం ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X