ఎన్టీఆర్‌ ఫన్నీ.. చిన్నపిల్లల మనస్తత్వం.. పవన్, వెంకీ, చిరు గురించి భూమిక

By Rajababu

టాలీవుడ్‌లో యువకుడుతో చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన భూమిక చావ్లా ఖుషీతో అభిమానుల గుండెలో చెరగని స్థానం ఏర్పరుచుకొన్నది. సింహాద్రి, ఒక్కడు చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టడమే కాకుండా అగ్రనటి హోదాను కల్పించాయి. వివాహం తర్వాత తెలుగు సినిమా పరిశ్రమకు దూరమయ్యారు భూమిక. ఇటీవల బాలీవుడ్‌లో ఎంఎస్ ధోని చిత్రంతో మళ్లీ రీ ఎంట్రి ఇచ్చారు. తాజాగా దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో నాని నటించిన ఎంసీఏ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆమె ఖాతాలో ఓ హిట్ కూడా పడింది. ఈ నేపథ్యంలో మీడియాతో భూమిక మాట్లాడుతూ.. ఆమె అభిప్రాయాలను వెల్లడించారు.

Recommended Video

వదినా మరిదీ మధ్య వార్.. MCA కొత్త పోస్టర్లు..!
ఎంసీఏతో సంతృప్తి

ఎంసీఏతో సంతృప్తి

ఎంసీఏతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ నాకు సంతృప్తి లభించింది. ఈ చిత్రంలో నాని పాత్రకు, నేను పోషించిన జ్యోతి పాత్రకు మంచి స్పందన వస్తుందని తెలుసుకొన్నాను అని భూమిక చెప్పింది.

 మధ్య వయసు మహిళ పాత్రల్లో

మధ్య వయసు మహిళ పాత్రల్లో

మధ్య తరగతి యువతి పాత్రలకు టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. యే దిల్ హై ముష్కిల్, సరబ్‌జిత్ చిత్రాల్లో ఐశ్వర్యరాయ్ పాత్రలు, తుమ్హారీ సులు చిత్రంలో విద్యాబాలన్ పాత్రలు నాకు బాగా నచ్చాయి.

నాకు ఆఫర్లు రాలేదు

నాకు ఆఫర్లు రాలేదు

ఎంసీఏ సినిమా అంగీకరించే వరకు నాకు మంచి ఆఫర్లు రాలేదు. నేను చేద్దామనుకొన్న కొన్ని సినిమాలు వర్కవుట్ కాలేదు. కొన్ని మంచి చిత్రాల ఆఫర్లు ఉన్నా అవి కార్యరూపం దాల్చలేదు. ఎందుకంటే నాకు మేనేజర్ లేడు. సెక్రటరీ లేరు. నాకు సినిమా ఆఫర్లు రాకపోవడానికి అదే కారణం కావొచ్చు.

 నా కొడుకే నాకు ప్రపంచం

నా కొడుకే నాకు ప్రపంచం

ఇప్పుడు నా కొడుకే నాకు ప్రపంచం. అతడితోనే నా జీవితం ముడిపడి ఉంది. ఎంసీఏ సినిమా చేసేటప్పుడు దిల్ రాజుకు చెప్పాను. నేను అందరి మాదిరిగా నేను ఏడు గంటలకు సెట్స్‌కు రాలేను. రాత్రి వరకు సెట్స్‌లో ఉండలేను. ఎందుకంటే నేను నా కుమారుడిని చూసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని చెప్పాను అని భూమిక వెల్లడించింది.

 పవన్, మహేశ్‌తో సినిమా

పవన్, మహేశ్‌తో సినిమా

పవన్, మహేశ్, ఎన్టీఆర్‌తో సినిమాలు చేయడానికి ఇష్టమే. హీరోయిన్‌గా నేను చేయలేను. అలా అని 60 ఏళ్ల పాత్రలు కూడా చేయలేను. స్క్రిప్ట్‌ను బట్టి నేను వాళ్లతో నటించే పరిస్థితి ఆధారపడి ఉంటుంది.

 పవన్ గురించి ఎక్కువ తెలియదు

పవన్ గురించి ఎక్కువ తెలియదు

పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఉన్నాడని తెలుసు. కానీ నాకు రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేదు. ఆయన పాలిటిక్స్‌ గురించి నాకు అసలే తెలియదు. నేను న్యూస్ చూడను. న్యూస్ పేపర్లు చదవను. కొద్ది నెలలుగా బయటి ప్రపంచం గురించి పట్టించుకోవడం లేదు.

 మధు పాత్రను మరిచిపోలేను

మధు పాత్రను మరిచిపోలేను

నా మొదటి చిత్రం యువకుడులో సుమంత్‌తో నటించాను. నా కెరీర్‌లో ఇష్టపమైన పాత్ర పేరు ఖుషీలోని మధు. నేను నటించిన చిత్రాల్లో ఖుషీ, మిస్సమ్మ,అనసూయ, ఒక్కడు, సింహాద్రి చిత్రాలు ఇష్టం అని భూమిక చెప్పింది.

 ఎన్టీఆర్, పవన్, వెంకీ గురించి

ఎన్టీఆర్, పవన్, వెంకీ గురించి

నేను నటించిన హీరోల్లో వెంకటేష్‌కు అధ్యాత్మికత ఎక్కువ. నాగార్జున చార్మింగ్, చిరంజీవి పవర్‌ఫుల్, ఎన్టీఆర్‌ది చిన్నపిల్లల మనస్తత్వం, చాలా ఫన్నీగా ఉంటాడు. మహేశ్‌బాబు సైలెంట్‌గా కనిపించినప్పటికీ.. మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంటుంది. పవన్ కల్యాణ్‌ ఓ సెన్సిబుల్ వ్యక్తి అని భూమిక తన అభిప్రాయాలను వెల్లడించింది.

 అమీర్, సూర్య అంటే..

అమీర్, సూర్య అంటే..

భారతీయ సినిమా పరిశ్రమలో హీరోల విషయానికి వస్తే.. హిందీలో రణ్‌బీర్ కపూర్, అమీర్ ఖాన్ అంటే ఇష్టం. తమిళంలో సూర్య, కన్నడంలో సుదీప్, మలయాళంలో మోహన్ లాల్ సర్ అని చెప్పింది.

 నాకు నచ్చిన హీరో దిల్ రాజు

నాకు నచ్చిన హీరో దిల్ రాజు

తెలుగులో తనకు నచ్చిన హీరోలు చెప్పాలని అడిగిన ప్రశ్నకు నేను చెప్పి ఇబ్బందుల్లో పడలేదు. ఐదు పేర్లు కూడా నేను చెప్పలేను. చెప్పడం భావ్యం కాదు. నేను చెబితే వెబ్‌సైట్లు ఆ విషయాన్ని రచ్చరచ్చ చేస్తాయి. నా ఫేవరేట్ హీరో దిల్ రాజు సర్ అని భూమిక తప్పించుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X