twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వయసు దాచుకోను.. అలా నటించమన్నా ఒకే.. నాని, సాయిపల్లవిని చూస్తే.. భూమిక చావ్లా

    By Rajababu
    |

    ఖుషీ చిత్రంలో పవన్ కల్యాణ్‌తో పోటాపోటిగా నటించి మెప్పించింది భూమిక చావ్లా. పెళ్లి తర్వాత సినీ పరిశ్రమకు కొంతకాలంగా దూరంగా ఉండిపోయింది. తాజాగా నాని, సాయి పల్లవి జంటగా నటించిన ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రంలో ఓ పవర్ ఫుల్ పాత్ర పోషించింది. తెలుగులో భూమిక రీ ఎంట్రీ అదిరిపోయింది అనే వార్తల నేపథ్యంలో ఇటీవల భూమిక మీడియాతో ముచ్చటించారు. భూమిక వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే..

    Recommended Video

    పేరుకే ‘మిడిల్ క్లాస్’.... కలెక్షన్లు మాత్రం అలా లేవు!
     రీ ఎంట్రీ అదిరింది

    రీ ఎంట్రీ అదిరింది

    నేచురల్ స్టార్ నాని నటించిన ఎంసీఏ చిత్రానికి ముందు భూమిక 2013లో లడ్డు బాబు చిత్రంలో నటించింది. అప్పటి నుంచి తెలుగు తెరపైన కనిపించలేదు. చాలా రోజుల తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. టాలీవుడ్‌లో రీఎంట్రీ అదిరిపోయింది.

     ఎంఎస్ ధోనితో రీ ఎంట్రీ

    ఎంఎస్ ధోనితో రీ ఎంట్రీ

    ఇండియన్ క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోని జీవిత కథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే దర్శకత్వంలో వచ్చిన ఎంస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరి అనే చిత్రంలో ధోని అక్క పాత్రలో భూమిక నటించింది. ఆ చిత్రానికి భూమికకు మంచి ప్రశంసలు వచ్చాయి.

     టాలీవుడ్ అంటే ఇష్టం

    టాలీవుడ్ అంటే ఇష్టం

    తన రీఎంట్రీ గురించి భూమిక మాట్లాడుతూ.. ఏ పాత్ర వస్తే దానిని అంగీకరించను. టాలీవుడ్ అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు సినీ పరిశ్రమ నాకు మంచి జీవితాన్ని ఇచ్చింది అని భూమిక చెప్పింది.

     విద్యాబాలన్ స్ఫూర్తి

    విద్యాబాలన్ స్ఫూర్తి

    బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటించిన తుమ్హారీ సులు చిత్రం చూసి నేను ఫిదా అయ్యాను. సులుగా విద్యా అద్భుతంగా నటించింది. లావుగా, చీరలు కట్టుకొని ఓ అబ్బాయికి తల్లిగా నటించింది. అలాంటి పాత్రలు నాకు వస్తే నేను అంగీకరిస్తాను అని భూమిక పేర్కొన్నది.

     వదిన పాత్ర అనగానే

    వదిన పాత్ర అనగానే

    ఇక ఎంసీఏ చిత్రానికి సంబంధించి దర్శక, నిర్మాతలు వదిన పాత్ర గురించి చెప్పినప్పడు మంచి రోల్ అనిపించింది. గతంలో నేను చేయనటువంటి పాత్రను చేయాలనిపించింది. రవాణాశాఖలో ఆర్టీవో పాత్ర అనగానే.. ఆ ఉద్యోగుల బాధ్యతలను తెలుసుకొన్నాను.

    నానికి వదినగా అంటే

    నానికి వదినగా అంటే

    ఇక నాని పాత్రపై ప్రభావం చూపే రోల్ అని చాలా సంతోషంగా ఫీలయ్యాను. చాలా కోణాలు ఉన్న పాత్ర అని తెలుసుకొన్న తర్వాత ఆ పాత్రను తిరస్కరించలేకపోయాను. పాత్ర గురించే ఆలోచించాను గానీ వదినగా నటించాలా అనే ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు.

     వయసుకు తగిన పాత్రలు

    వయసుకు తగిన పాత్రలు

    నా వయసు తగిన పాత్రలను పోషించాలని అనుకొంటున్నాను. నేను ఎందుకు వయసును దాచుకోవాలి. నా వయసుకు తగిన పాత్రలను పోషించడానికి వెనుకాడను. పాత్ర బాగుంటే 40 మహిళగా కనిపించడానికి రెడీ అని భూమిక చెప్పింది.

     ఎంసీఏ చక్కటి అనుభూతి

    ఎంసీఏ చక్కటి అనుభూతి

    టాలీవుడ్ పరిశ్రమకు మళ్లీ తిరిగి రావడం చాలా ఆనందంగా ఉంది. టాలీవుడ్‌ నుంచి మళ్లీ అవకాశాలు రావడం సంతోషంగా ఉంది. నిర్మాత దిల్ రాజు మంచి మనిషి. పక్కా ప్రొఫెషనల్. ఎంసీఏ చిత్రంలో నటించడం వల్ల చక్కటి అనుభూతి కలిగింది.

    నాని, సాయి పల్లవి

    నాని, సాయి పల్లవి

    నాని మంచి మనుసు ఉన్న వ్యక్తి మాత్రమే కాదు.. ఓ అద్భుతమైన మనిషి. చాలా నిజాయితీగా ఉంటారు. పెద్ద హీరోగా ఎదిగినా అణుకువగా ఉంటారు. సాయి పల్లవి చాలా చురుకుగా ఉంటారు. రెండు రోజులపాటు ఆమెతో నటించిన తర్వాత ఆమెను చూస్తే కాజోల్ మాదిరిగా అనిపించింది. ఎంసీఏ షూటింగ్ అంతా ఎంజాయ్‌లా గడిచిపోయింది.

    English summary
    Bhumika Chawla, last seen in 2013 Telugu film Laddu Babu, plays Nani’s sister-in-law in this week’s latest outing MCA – Middle Class Abbayi, which has had a phenomenal opening at the box-office. Her role in the film has been received very well with critics praising her restrained performance.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X