భూమిక ఇప్పుడు ఇ. నివాస్ దర్శకత్వంలో రూపొందనున్న '90 మినిట్స్' అనే థ్రిల్లర్ లో నటించేందుకు అంగీకరించింది.హీరోయిన్ ఓరియంటడ్ గా వచ్చిన మంత్ర,అనసూయ సినిమాలు హిట్టవటంతో ఆ తరహా థ్రిల్లర్స్ కి బాగా డిమాండు పెరిగింది.అందులో నటించిన హీరోయిన్లు కి ఐతే మరీను.భూమిక ఈ రేసులో ముందుంది.దాంతో'90 మినిట్స్'లో ఆఫర్ వచ్చింది.టైటిల్‌కి తగ్గట్లే ఈ సినిమా 90 నిమిషాల్లో నడిచే కథతో కధనం ప్రధానంగా ఉండే థ్రిల్లర్.అలాగే కోడి రామకృష్ణ శిష్యుడు శ్రీనివాస్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఇంకా పేరు పెట్టని చిత్రంలో శ్రీకాంత్‌కి జోడీగా నటించబోతోంది.అదీ థ్రిల్లరేనట.అంటే త్వరలో మరిన్ని థ్రిల్లర్స్ ని తెలుగు తెరపై చూడచ్చన్న మాట.ప్రస్తుతం భూమిక దర్శకుడు వి. సముద్ర రూపొందిస్తున్న 'మల్లెపూవు' లో మురళి అనే కొత్త హీరోకి జోడీగా నటిస్తోంది.