హిమాలయాల్లో భూమిక తకిట తకిట
భూమిక ప్రధాన పాత్ర చేస్తూ...తన భర్త భరత్ ఠాకూర్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రం 'తకిట తకిట'. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హిమాలయాల్లో జరుగుతోంది. భూమికతో సత్యభామ చిత్రాన్ని రూపొందించిన శ్రీహరి నాను ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. పది రోజుల పాటు జరిగే ఈ చివరి షెడ్యూల్ లో ఒక పాట, కొన్ని ముఖ్య సన్నివేశాలు చిత్రీకరిస్తాం. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవటానికి సన్నాహాలు చేస్తున్నారు. అందరూ కొత్తవారితో భూమిక ముఖ్య పాత్ర చేస్తూ..నిర్మిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, అనుష్క అతిథి పాత్రల్లో గెస్ట్ రోల్స్ లో కనపడనున్నారు.
నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా గురించి దర్శకుడు శ్రీహరి నాను మీడియాతో మాట్లాడుతూ...చిత్రం ద్వారా ఎంతో మంది కొత్త నటీనటులు పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా విజయం సాధించి అందరికీ మంచి ఫ్యూచర్‌ని అందిస్తుంది. ఇది నమ్మకంతో చెబుతున్న మాట. అలాగే పూర్తి ఎంటర్‌టైనర్‌గా భారీ ఎత్తున భూమిక, భరత్ ఠాకూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అంటున్నారు. ఇక ఈ చిత్రానికి రచన: కోన వెంకట్, మాటలు: బివీఎస్ రవి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా: కె.కె.సెంథిల్ కుమార్, సంగీతం: బోబో శశి, సమర్పణ: భూమిక చావ్లా, నిర్మాత: భరత్ ఠాకూర్, నిర్మాణం: డౌన్‌టౌన్ ఫిలింస్.


Click it and Unblock the Notifications











