వదినా మరిదీ మధ్యా వార్ ఎంసీయే: నాని వదినగా భూమిక కొత్త పోస్టర్లు

Recommended Video

వదినా మరిదీ మధ్య వార్.. MCA కొత్త పోస్టర్లు..!

ఈ మధ్య భూమిక కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ఆమె మళ్లీ సినిమాల వైపు చూస్తున్నట్లు వార్తలొచ్చాయి. పోయినేడాది బాలీవుడ్ మూవీ 'ఎం.ఎస్.ధోని'లో హీరో అక్క పాత్రలో కనిపించింది భూమిక. అందులో తన లుక్ చూడగానే ఇక ఆమె అక్క, వదిన పాత్రలకు ఫిక్సయిపోవాల్సిందే అన్న అభిప్రాయం కలిగింది ఆమె కూడా అదే అనుకుందేమో, నానికి వ‌దిన‌గా భూమిక క‌నిపించ‌నుంది.

ప్రాణాల‌ను లెక్క చేయ‌కుండా

ప్రాణాల‌ను లెక్క చేయ‌కుండా

వ‌దిన ఆర్టీఓ అధికారిగా ప‌నిచేస్తుందట. నాని ఏమో గాలికి తిరుగుతుంటాడు. ఈ వ‌దిన‌కు, మ‌రిదికి ఒక్క క్ష‌ణం కూడా ప‌డ‌ద‌ట‌. మ‌రిదిని ఎప్పు డూ చిన్న చూపు చూస్తుంద‌ట వ‌దిన‌. అయితే, అనుకోకుండా వ‌దిన ఓ స‌మ‌స్య‌లో ఇరుక్కోవ‌డం... ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌కుండా వ‌దిన కోసం మ‌రిది నిల‌బ‌డ‌టంతో.. మ‌రిది గొప్ప‌త‌నం తెలుసుకుంటుంది భూమిక‌.

సాయిప‌ల్ల‌వి

సాయిప‌ల్ల‌వి

అయితే, విన‌డానికి ఈ స్టోరీ సింపుల్‌గా ఉన్నా.. ట్రీట్‌మెంట్ మాత్రం చాలా కొత్త‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు. సాయిప‌ల్ల‌వి ఈ సినిమాలో హీరోయిన్‌... ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు. డిసెంబ‌ర్ 15న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

నాని క్యారెక్టర్ కు వదిన పాత్ర

నాని క్యారెక్టర్ కు వదిన పాత్ర

ఎంసీఏ చిత్రంలో భూమిక అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది. నాని క్యారెక్టర్ కు వదిన పాత్రలో ఈమె నటిస్తోందనే విషయాన్ని ఇప్పటికే నిర్మాత దిల్ రాజు రివీల్ చేసేశారు. వదిన ,మరిది మధ్య జరిగే ఘర్షణను దర్శకుడు వేణు తెరకెక్కించిన విధానం ఆకట్టుకుందని కూడా చెప్పారు నిర్మాత.

రాజీవ్ కనకాల

రాజీవ్ కనకాల

ఇప్పుడీ పాత్రకు సంబంధించిన లుక్స్ రివీల్ చేశారు. భూమిక సీన్స్ కు సంబంధించిన పోస్టర్స్ ను విడుదల చేయగా.. ఒకదాంట్లో భూమిక, రాజీవ్ కనకాల దండలు మార్చుకునే సీన్ చూపించారు. ఇందులో హీరో నాని.. హీరోయిన్ సాయిపల్లవిలు డ్యాన్స్ చేస్తుంటారు.

 భూమిక వెనుక

భూమిక వెనుక

మరో పోస్టర్ లో సీరియస్ గా ఉన్న భూమిక వెనుక.. అంతకంటే సీరియస్ గా ఉన్న నాని నడుస్తుంటాడు. రెండు పోస్టర్లు సూపర్బ్ గా ఉన్నాయి. గతంలో హీరోయిన్ గా ఎలాంటి లుక్ లో ఉందో అదే ఫిజిక్ మెయింటెయిన్ చేస్తున్నా.. తన ట్యాలెంట్ తో పాటు మెచ్యూరిటీని కూడా కలగలుపుతోంది భూమిక.

గతంలో స్టార్ హీరోయిన్

గతంలో స్టార్ హీరోయిన్

గతంలో స్టార్ హీరోయిన్ కాబట్టి.. ఇప్పుడు వదిన క్యారెక్టర్ లో మెప్పించడం భూమికకు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. అయితే అప్పట్లో టాలీవుడ్ బ్లాక్‌బస్టర్లలోనే ఒకటిగా నిలిచిన ఖుషీలాంటి సినిమాలో పవన్ సరసన కనిపించిన భూమిక ఇప్పుడు ఇలా కనిపించటం పాపం ఆమె అభిమానులకు కాస్త బాధ కలిగించే విషయమే

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X