భూమిక కొత్త చిత్రం రిలీజ్ దీపావళికే...
భూమిక తాజా చిత్రం 'కలెక్టర్ గారి భార్య" నవంబర్ 5న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు టేకుల కృపాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..."పరుచూరి బ్రదర్స్ ప్రోత్సాహం వల్లే ఈ సినిమా తీయగలిగా. కమర్షియల్ కాన్సెప్టుతో కాకుండా సినిమా మీద తపనతో ఈ రంగానికి వచ్చా. పెళ్లి తర్వాత ఓ స్త్రీ తన వ్యక్తిత్వాన్ని నిలుపుకోడానికి ఏం చేసిందన్నది ఈ సినిమా. పురుషాధిక్య ప్రపంచానికి ఎదురుతిరిగి, భార్తకు భార్య విలువ తెలియజెప్పిన ఓ భార్య కథ ఇది. మన సమాజంలో నేటి స్త్రీ పరిస్థితి ఎలా ఉందో ఇందులో చర్చించాం. పరుచూరి బ్రదర్స్ చాలా చక్కని సంభాషణలు రాశారు" అని ఆయన చెప్పారు.
భూమిక మాట్లాడుతూ చాలా చిత్రాల్లో పెళ్లి కాకముందు ప్రేమ ఎలా ఉందో చూపిస్తారు. కానీ పెళ్లి జరిగిన తర్వాత చూపించరు. స్ర్తిల ను ఎలా గౌరవించాలి? భర్త భార్యపై ఏ విధంగా బాధ్యతతో మెలగాలో ఈ చిత్రంలో చక్కగా దర్శకుడు చూపించాడని తెలిపారు. పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ధర్మవరపు, వేణుమాధవ్, ఎమ్మెస్ నారాయణ, కృష్ణ భగవాన్, వైజాగ్ ప్రసాద్, మల్లాది రాఘవ, మెల్కోటి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: పైడిశెట్టి రామ్, కెమెరా: పూర్ణకాండ్రు, సంగీతం: చిన్నా, ఆర్ట్: వర్మ, ఎడిటింగ్ గౌతంరాజు, నిర్మాతలు: బి.వనితావాణి, ఎ.రాధికరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టేకుల కృపాకరరెడ్డి.


Click it and Unblock the Notifications











