భూమిక తన డౌన్ టౌన్ బ్యానర్ పై నాటు కోడి పులుసు అనే టైటిల్ తో సినిమా చేయటానికి సన్నాహాలు చేస్తోందని సమాచారం. అయితే ఆమె అందులో హీరోయిన్ గా చేయదట..కొంచెం సెక్సీగా ఉండే వేరే హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెలుస్తోంది. ఇక దర్శకుడు శ్రీహరి నాను అని వినపడుతోంది. భూమికతో సత్యభామ అనే చిత్రం రూపొందించి ప్లాప్ కొట్టిన అతని టాలెంట్ పై భూమికకు ఇంకా నమ్మకం సడలక మరో ప్రయోగానికి అవకాశమిస్తోందని అంటున్నారు. దాంతో అతను కూడా సిన్సియర్ గా ఎట్లాగయినా హిట్ కొట్టేలనే తాపత్రయంతో ఇట్లాంటి స్పైసీ టైటిల్ పెట్టి,సీన్స్ కూడా అదే రేంజిలో అల్లి ప్రేక్షకులను అలరించి భూమిక నమ్మకాన్ని నిజం చేయాలని నిర్ణయించుకున్నాడుట. ఇప్పటికే డౌన్ టౌన్ ఎంటర్టైన్ మెంట్స్ భూమిక హీరోయిన్ గా యాగం అనే చిత్రం తీస్తోంది. నవదీప్ హీరోగా బ్యాంకాంక్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ కథని తమ్ముడు ఫేమ్ అరుణ్ ప్రసాద్ డైరక్ట్ చేస్తున్నాడు. ఇక భూమిక ప్రస్తుతం మళయాళంలో ఓ సినిమా కూడా చేస్తోంది.