Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
భూమికను వాడుకుంటున్న..
భూమిక, రాజశేఖర్ నటించిన నా స్టైలే వేరు చిత్రం రేపు(శుక్రవారం)అంతటా రిలీజవుతోంది. మళయాళ చిత్రం హలో ఆధారంగా తయారైన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రం పబ్లిసిటీలో సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్‌కి ప్రాథాన్యత తగ్గించటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పబ్లిసిటీలో కేవలం భూమిక ఫొటోలనే ఎక్కువగా వాడుతూ హీరో రాజశేఖర్ ఫోటోలను తక్కువగా వాడుతున్నారు. ప్రోమోలలో సైతం భూమికనే ఎక్కువగా చూపుతున్నారు. ఇవన్నీ చూస్తూ కూడా డాక్టర్ రాజశేఖర్ మౌనంగా ఊరుకుంటున్నాడు.
కారణం తను హీరోగా నటించగా ఆ మధ్య విడుదలైన "సత్యమేవజయతే" చిత్రం ఫ్లాప్ కావటమేనంటున్నారు సినీ జనం. ఏదైమైనా భూమికను వాడుకుంటూ..ఈ చిత్రం హిట్ కొట్టాలని నిర్మాతలు భావిస్తున్నారు. మళయాళంలో మోహన్ లాల్ నటించిన 'హలో' చిత్రం తెలుగు రీమేక్ ఇది. 'చిరునవ్వుతో' దర్శకుడు రామ్ ప్రసాద్ డైరక్ట్ చేయనున్న ఈ సినిమా ఆద్యంతం కామిడీతో సాగుతుంది. ఇక ఈ ప్రాజెక్టుకు నిర్మాత గా మాగంటి గోపీనాథ్ వ్యవహరించనున్నారు. ఇక కథప్రకారం బధ్దకస్తుడైన..తాగుబోతు లాయర్ గా రాజశేఖర్ కామిడీ పండిస్తాడు. అతనికి వచ్చిన ఒక మిస్టీరియస్ కాల్ అతని జీవిత గమనాన్ని మారుస్తుంది.