భర్తపై డైవర్స్ పిటిషన్ పై భూమిక స్పందన
భూమిక తన భర్త భరత్ ఠాకూర్ నుంచి విడాకుల కోరుకుంటూ డైవర్స్ పిటీషన్ వేసిందంటూ ఓ వర్గం మీడియాలో వచ్చిన వార్తలను ఆమె ఖండించింది. ఈ విషయం పై ఆమె మాట్లాడుతూ...నేను చాలా ఈ విషయమై విచారంగా ఉన్నాను. మీడియా కి సెలబ్రీటిలు విడిపోవటం ఆసక్తి యేమో..అలాంటి ప్రచారాలు చేస్తున్నారు. ఇది నా ఒక్కరి విషయంలోనే కాదు అర్భాజ్ ఖాన్ -మలైకా అరోరా, శిల్పా శెట్టి..రాజ్ కుంద్రాలకూ తప్పలేదు.నేనూ మరోసారి చెప్తున్నాను..నా భర్తలో ఏ విధమైన విభేదాలు లేవు..ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఇద్దరం రీసెంట్ గా టూర్ కి కూడా వెళ్ళాం.. అలాగే బెనారస్ లో స్టే చేసాం. అక్కడ బెనారస్ శారీలు తీసుకున్నాను. దీన్ని బట్టి మా మధ్య అన్యోన్యత ఉందో లేదో అంచనా వేయండి అంది. ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ..తకిట తకిట తర్వాత బ్రేక్ తీసుకోవాలనిపించింది. ఎందుకంటే నేను ఈ స్టేజీలో ఇంకా గ్లామర్ పాత్రలు చేస్తే బావుండదు. నటనకు అవకాశమున్న పాత్రలు చేయాలి.వాటి కోసం వెయిట్ చేస్తున్నాను. అన్ని అనుకూలిస్తే ఆగస్టు నుంచి ఓ కామిడిలో నటిస్తాను అంది.


Click it and Unblock the Notifications











