twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భూమిక సొల్లు కబుర్లు

    By Staff
    |

    Bhoomika
    వినేవాడుంటే చెప్పే వారికి లోకువ అన్నట్లు భూమిక ఈమధ్య ఓ జర్నిలిస్టుకి తన సెల్ పరిజ్ఞానాన్ని బోధించింది. నా స్టైలే వేరు షూటింగ్ స్పాట్‌లో ఓ సీన్‌లో నటించి గ్యాప్ లో దగ్గరే ఉన్న ఓ చెట్టు కింద సేదతీరుతూండగా ఓ జర్నలిస్టు ఆమె ఇంటర్యూకోసం వెళ్లాడు. అప్పుడామే తమ చేతిలో ఉన్న సెల్ చూపుతూ ముంబయి మహా నగరంలో సెల్‌ఫోన్ల వల్ల అనేక టూవీలర్ ప్రమాదాలు జరుగుతుంటాయి. ముంబయిలోనే కాదు అలా ప్రతి మహానగరంలోనూ జరిగే టూవీలర్ యాక్సిడెంట్‌లలో 50 శాతం సెల్‌ఫోన్ కారణంగానే జరుగుతున్నాయని పోలీసులు లెక్కలు చెపుతున్నాయి.మహేష్‌భట్‌గారు ఓ సందర్భంలో మాట్లాడుతూ సెల్‌ఫోన్ల వల్ల టూవీలర్ ప్రమాదాలే కాదు టూ కాలర్ ప్రమాదాలు కూడా జరుగుతాయని సెల్‌ఫోనును చేతిలో పట్టుకుని ఊపుతూ చమత్కరించారు అంది.

    ఇంటర్వూ అంటే ఈ సొల్లు కబుర్లు ఏంటిరా అనుకుంటూంటే ..అదీమీ పట్టించుకోకుండా నా మటుకు నేను ముఖ్యమైన పేపర్లు డీల్ చేస్తున్నప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు ప్రాజెక్టులకు సంబంధించిన వివరణ జరుగుతున్నప్పుడు, చేతిలో సెల్‌ఫోన్ అవసరమా కాదా అని నిర్ణయించుకుంటాను.సాధ్యమైనంత వరకూ అవతలి కాల్స్‌ను ఎవాయిడ్ చేస్తాను లేదా మెయిల్ బాక్సుకు డైవర్టు చేస్తాను. సెల్ ఫోన్‌ను మాత్రం స్విచాఫ్ చేయను. స్విచాఫ్ చేస్తే అవతలి వ్యక్తిని కించపరిచినట్లు అవుతుంది" అని చెప్పి మరో సన్నివేశంలో నటించడానికి లేచి వెళ్లిపోయిందట.అవతలి జర్నలిస్టు అవాక్కైపోయాడు. అదీ సంగతి.

    రాజశేఖర్..భూమిక కాంబినేషన్ లో సి.రాంప్రసాద్ రూపొందిస్తున్న చిత్రానికి నా రూటే సెపరేటు అనే టైటిల్ ని ఖాయం చేసారు. మళయాళ సూపర్ హిట్ హలో రీమేక్ ఆధారంగా తయారవుతున్న ఈ చిత్రం యాక్షన్ కామెడిగా సాగుతుంది. ఇందులో హీరో రాజశేఖర్ నలభై ఏళ్ళ వయస్సు వ్యక్తిలా కనపడతాడు. అతనో బద్దకపు క్రిమినల్ లాయరు. ఎప్పుడూ తాగుతూ ఉండే అతను వృత్తిని పెద్దగా పట్టించుకోడు. అలా తాగుబోతుగా తయారవటానికి అతనికో లవ్ ఫెయిల్యూర్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది.అయితే అతనికి ఓ రోజు వచ్చిన ఫోన్ కాల్ తో అతని జీవితం మలుపు తిర్గుతుంది.

    ఓ అమ్మాయి తాను చాలా ప్రమాదంలో ఉన్నానంటూ కాల్ చేస్తుంది. ఆమె తండ్రి పెద్ద కోటిశ్వరుడు. ఆయన కిడ్నిమార్పిడి కోసం విదేశాలకు వెళితే ఆమె చుట్టాలు,ఫ్యామిలి లాయిరు కలసి ఆమెను చంపి ఆ ఆస్ధి రాయించుకోవటానికి ట్రై చేస్తారు. అప్పుడు మన హీరో ఆమె భర్తగా ఆ ఇంటిలోకి ప్రవేశించి వాళ్ళకు బుద్ది చెప్పటానికి ప్రయత్నం చేస్తాడు. అయితే అతనికి తెలియదు తను తెలియక మరో ట్రాప్ లో ఇరుక్కున్నానని.ఇలా ట్విస్టులతో కామెడీతో నడిచే ఈ చిత్రం ఇక్కడా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు.

    అక్కడ మోహన్ లాల్ చేసిన పాత్రను రాజశేఖర్ చేస్తూంటే పార్వతి మిల్టన్ చేసిన ఫోన్ కాల్ చేసిన అమ్మాయి పాత్రను భూమిక చేస్తుందని, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే లవర్ పాత్రను అంకిత చేయవచ్చునని సమాచారం. చిరునవ్వుతో సినిమా తర్వాత హిట్స్ లేని దర్శకుడు రామ్ ప్రసాద్ చేస్తున్న మలి ప్రయత్నం ఇది కావటంతో అందరికి బాగానే అంచనాలు ఉన్నాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X