భూమిక అలా ఎలా చేసిందబ్బా?
రవిబాబు దర్శకత్వంలో అనసూయ సినిమా నిర్మితమవుతోంది. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో భూమిక కథానాయిక. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది. ఈ సినిమా గురించి భూమిక మాట్లాడుతూ జర్నలిస్టు పాత్రను బాగా ఎంజాయ్ చేశానంది. జర్నలిస్టులు ఏం చేస్తారు..ముఖ్యంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ఎలా పని చేస్తారు అనేది ఇంతకుముందు తెలుసుకోవాలని ఉండేది..ఇపుడు అది తెలిసిపోయిందని భూమిక అంటోంది. నిజ జీవితంలో చేయకపోయినా తెరమీద ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేశానని భూమిక తెగ సంతోషపడుతోంది. అవినీతి పరుల దుశ్చర్యలను వెలికితీసి సమాజానికి మంచి చేసే పాత్రలో భూమిక నటించింది. ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివి జర్నలిజం చేస్తూ స్టంట్స్ కూడా భూమిక చేసిందిట. పెద్ద పెద్ద గూండాలను బక్కపలచగా ఉండే భూమిక ఎలా ఎదుర్కొందన్నదేగా మీ డౌట్....తెర మీద చూస్తే భూమిక సత్తా బయటపడుతుంది మరి.


Click it and Unblock the Notifications











