For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సాహో: ప్రభాస్‌తో చేతులు కలిపిన బాలీవుడ్ బడానిర్మాత, రికార్డ్ స్థాయి రిలీజ్

  By Bojja Kumar
  |
  Saho Has A Big Cop Up With Major Producers

  బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు భారీ విజయం సాధించడంతో ప్రభాస్‌కు బాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అతడు నటిస్తున్న తాజా చిత్రం 'సాహో' చిత్రానికి ఫుల్ డిమాండ్ ఉండటంతో బాలీవుడ్ బడా సినీ నిర్మాణ సంస్థ టి సిరీస్ ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ దక్కించుకుంది. ఈ మేరకు యూవి క్రియేషన్స్ వారితో టీసిరీస్ అధినేత భూషణ్ కుమార్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. 'సాహో' చిత్రం టీ సిరీస్ చేతికి చిక్కడంతో ఈ చిత్రం హిందీ రిలీజ్ కనీవినీ ఎరుగని స్థాయిలో ఉంటుందని భావిస్తున్నారు.

   తరణ్ ఆదర్శ్ ట్వీట్

  తరణ్ ఆదర్శ్ ట్వీట్

  ప్రభాస్, యూవి క్రియేషన్స్ వారితో టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ‘సాహో' మూవీ కోసం అసోసియేట్ అవుతున్నారని, హిందీలో సాహో చిత్రాన్ని టీ సిరీస్ భారీగా విడుదల చేయబోతోంది అంటూ ప్రముఖ సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

  వచ్చే ఏడాది రిలీజ్ కానున్న సాహో

  వచ్చే ఏడాది రిలీజ్ కానున్న సాహో

  ‘సాహో' మూవీ 2019లోనే విడుదలవుతుందని ఈ సందర్భంగా తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. సాహో మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. పలు కారణాలతో ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమా విడుదలను వచ్చే ఏడాది వాయిదా వేయక తప్పలేదు.

   బాలీవుడ్ నుండి భారీ తారాగణం

  బాలీవుడ్ నుండి భారీ తారాగణం

  సాహో చిత్రాన్ని దక్షిణాది మార్కెట్‌తో బాలీవుడ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. అందుకే హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్, విలన్‌గా నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ ను ఎంపిక చేశారు. వీరితో పాటు కీ ష్రాఫ్‌, మందిరా బేడీ, చుంకీ పాండేలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

   150 కోట్లు కాదు... రూ. 200 కోట్లు

  150 కోట్లు కాదు... రూ. 200 కోట్లు

  తొలుత 150 కోట్ల బడ్జెట్ ఎస్టిమేషన్‌తో సాహో చిత్రాన్ని ప్రారంభించినా షూటింగ్ ఆలస్యం కావడం, ముందుగా అనుకున్న లొకేషన్లు కాకుండా కొన్ని మార్పులు జరుగడంతో సినిమా పూర్తయ్యే వరకు రూ. 200 కోట్ల బడ్జెట్ ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌, ముంబయి, అబు దాబి, దుబాయ్‌, రొమేనియా, యూరప్‌లలో చిత్రీకరణ జరుగుతోంది. హాలీవుడ్‌ నటుడు కెన్నీ బేట్స్‌ పర్యవేక్షణలో యాక్షన్‌ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

   అబుదాబిలో భారీ సెట్స్

  అబుదాబిలో భారీ సెట్స్

  ‘సాహో' సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ ఏప్రిల్ 12 నుండి అబుదాబిలో మొదలైంది. ఇందుకు సంబంధించిన సెట్స్ కోసం సాబు సిరిల్ అండ్ టీమ్ నెలల తరబడి శ్రమించారు. అబుదాబిలో ఎక్కడ షూట్ చేయాలి, ఎలాంటి సెట్టింగుల వేయాలి అనే దానిపై గత ఆరు నెలలుగా సాబు అండ్ టీమ్ అబుదాబిలో వివిధ ప్రాంతాలు పర్యటించారు. గత ఆరు నెలలుగా ఆయన 8 సార్లు అబుదాబి వెళ్లి వచ్చారట.

   300 మంది టీంతో సాబు, 4 కంటెనర్లలో సామాగ్రి

  300 మంది టీంతో సాబు, 4 కంటెనర్లలో సామాగ్రి

  అబుదాబిలో యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన సెట్స్ వేయడం కోసం 300 మంది టీంతో సాబు సిరిల్ అబుదాబిలో ల్యాండ్ అయ్యారు. ఇందులో పేయింటర్లు, మౌల్డర్స్, కార్పెంటర్స్, వెల్డర్స్, డిజైనర్స్ తదితరులు ఉన్నారు. సెట్స్ వేయడానికి కావాల్సిన సామాగ్రిని 4 కంటైనర్లలో షిప్స్ ద్వారా ఇండియా నుండి అబుదాబి తరలించి సెట్స్ వేశారు.

   ఒళ్లు గగుర్బొడిచే యాక్షన్ సీన్లు

  ఒళ్లు గగుర్బొడిచే యాక్షన్ సీన్లు

  సాహోలో సుమారు 20 నిమిషాల పాటు ఒళ్లు గగుర్బొడిచే సీక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆ స్టంట్ సీక్వెన్స్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. బైక్‌లు, కార్లు, ట్రక్కులతో ఆ ఛేజింగ్ సీక్వెన్స్ ఉంటుందని సమాచారం.

   రూ. 40 కోట్లు కేవలం ఈ సీన్ల కోసమే

  రూ. 40 కోట్లు కేవలం ఈ సీన్ల కోసమే

  ఈ యాక్ష‌న్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా ఉంటుంద‌ని, అందుకోసం ఏకంగా 40 కోట్ల భారీ బ‌డ్జెట్‌ని ఖ‌ర్చు చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. మొదట ఇంత ఖర్చు ఎలా? అని అంతా ఆశ్చర్యపోయారు. కానీ సాబు సిరిల్ చెప్పిన విషయాలు విన్న తర్వాత ఎందుకు ఇంత ఖర్చు అవుతుందో అర్థం చేసుకోవచ్చు.

  English summary
  After the humongous response to Prabhas' Baahubali franchise in the North, his upcoming film Saaho remains highly anticipated. Bollywood producer Bhushan Kumar has now joined hands with UV Creations, one of the leading and most successful production houses in the south to present the film in Northern markets of India. Bhushan Kumar's T-Series has inked a deal with UV Creations to present Prabhas' Saaho to the Hindi audience.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X