Bhuvana Vijayam: షూటింగ్ టైమ్ లో మెగాస్టార్ సినిమాల అనిపించింది.. పృథ్వీరాజ్ కామెంట్స్
సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్, థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్ అలాగే మరికొంత మంది కమెడియన్లు కలిసి నటించిన చిత్రం భువన విజయం. కామెడీ థ్రిల్లర్ జోనర్ లో ఈ చిత్రాన్ని నూతన డైరెక్టర్ యలమంద చరణ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాను మే 12వ తేదీ అంటే రేపే విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో చిత్రబృందం ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ ఆసక్తికర కామెంట్లు చేశారు.
హిమాలయ స్టూడియో మాన్షన్స్, మిర్త్ మీడియా బ్యానర్లపై ఉదయ్ కిరణ్, శ్రీకాంత్ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రం కోసం ప్రొడ్యూసర్ల ఎక్కడా తగ్గలేదని చెప్పారు. ఏం కావాలన్నా క్షణాల్లో ఇచ్చి సినిమాను ఎలాగైనా హిట్టు చేసేందుకు చాలా కష్టపడ్డారని అన్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి సినిమా షూటింగ్ సమయంలో ఉన్నట్లుగా ఓ పదీ, ఇరవై క్యారవాన్లు కనిపించాయని.. ఇంత మంది గొప్ప గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్టులందరినీ ఒక్క చోటుకు చేర్చి సినిమా తీయడం నిజంగా గ్రేట్ అంటూ చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా ఈ సినిమా డైరెక్టర్ యలమంద చరణ్ గురించి మాట్లాడుతూ... చూసేందుకు ఆయన చిన్నగా ఉన్నా టాలెంట్ మాత్రం చాలా ఎక్కువని పొగిడారు. ప్రతీ సీన్ గుర్తుంచుకొని అందరికీ ఎక్స్ ప్లేన్ చేస్తూ సినిమాను తెరకెక్కించారన్నారు. తాను అనుకున్నదానికి వెయ్యి శాతం న్యాయం చేసి సినిమా తీశారన్నారు. ఈ సినిమాలో పని చేసిన ఇతర నటీ నటులు గురించి కూడూ వివరించారు.
ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నంత సేపు ఫ్యామిలీ అంతా కలిసి వెకేషన్ కు వెళ్లినట్లు మాత్రమే అనిపించిందని.. ఏమాత్రం అసలట, పని చేసిన ఫీలింగ్ రాలేదన్నారు. అంతా కలిసి పని చేయడం, కలిసి తినడం తనకు చాలా బాగా నచ్చిందన్నారు. సినిమా కథ అదిరిపోయిందని.. కచ్చితంగా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తుందని పృథ్వీరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్, జబర్దస్త్ రాఘవ, షేకింగ్ శేషు, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ ఇలా అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మే12 వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రం ఎలా ఏ రేంజ్ లో హిట్టు కొడుతుందో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











